వాళ్లడిగితే నేను కాదంటానా? | I have not been approached for 'Sultan': Kriti Sanon | Sakshi
Sakshi News home page

వాళ్లడిగితే నేను కాదంటానా?

Published Mon, Aug 24 2015 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వాళ్లడిగితే నేను కాదంటానా? - Sakshi

వాళ్లడిగితే నేను కాదంటానా?

 ‘‘మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందంటారు. నేను దీన్నే కొంచెం రివర్స్ చేసి చెబుతా. ఒక సినిమా ఎవరికి దక్కాలని రాసి పెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుంది’’ అని కృతీ సనన్ అంటున్నారు. ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతీ సనన్ ‘హీరో పంతి’తో బాలీవుడ్‌లో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు, మూడు సినిమాలు చేస్తూ కృతి బిజీగా ఉన్నారు.

సల్మాన్ ఖాన్ సరసన ‘సుల్తాన్’లో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించిందనే వార్త హల్‌చల్ చేస్తోంది. కథానాయిక అయిన ఏడాదికే సల్మాన్‌తో అవకాశం కొట్టేసిందని కొంతమంది తారలు అసూయపడుతున్నారట. కానీ, ఏమీ లేని విషయానికి అనవసరంగా అసూయపడుతున్నారని కృతి అంటున్నారు. అసలు ‘సుల్తాన్’ చిత్రానికి ఆమెను అడగలేదట. ఒకవేళ అడిగితే నేనెందుకు కాదంటాను? అంటున్నారామె. సల్మాన్‌తో సినిమా కాబట్టి, వెంటనే ఒప్పేసుకుంటా అని పేర్కొన్నారు కృతీ సనన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement