నేనెందుకు పాపులర్‌ అయ్యానంటే..? | Salman Khan thinks he is popular because... | Sakshi
Sakshi News home page

నేనెందుకు పాపులర్‌ అయ్యానంటే..?

Published Tue, Aug 9 2016 8:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నేనెందుకు పాపులర్‌ అయ్యానంటే..? - Sakshi

నేనెందుకు పాపులర్‌ అయ్యానంటే..?

మూడు దశాబ్దాల కెరీర్‌... అసాధారణమైన విజయాలు.. ఎవరు అందుకోలేని స్టార్‌డమ్‌.. కొన్ని వివాదాలు.. ఇవన్నీ కలిస్తే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్. భారీ విజయాలతో, కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ కండలవీరుడు.. తనకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందనే విషయమై కొంత ఆసక్తిగా స్పందించాడు.

50 ఏళ్ల సల్మాన్‌ తాజాగా 'ఓపెన్‌' మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందనే దానిపై ఎప్పుడైన ఆలోచించారా? ప్రశ్నించగా.. 'అవన్నీ ఎవరు ఆలోచిస్తారు గురూ! నడుస్తోంది కదా నడవనివ్వండి. నేనెందుకు పాపులర్‌ అవ్వడానికి కారణం.. నాకు అన్ని కొంచెం కొంచెం తెలిసి ఉండటం కావొచ్చు. నాకు కొంచెం డ్యాన్స్‌, కొంచెం యాక్టింగ్‌, కొంచెం యాక్షన్‌ వచ్చు' అని సల్మాన్‌ బదులిచ్చాడు. తాను సినిమాల్లో పోషించే పాత్ర మంచిదై ఉండాలని, బ్రూస్‌లీలా మంచికి పాటుపడే పాత్ర, ప్రజలు చూసేందుకు ఇష్టపడే పాత్రను నేను తాను చేయాలనుకుంటానని సల్మాన్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement