సుల్తాన్ సూపర్ హిట్ : బాలీవుడ్ ప్రముఖులు | Sultan a blockbuster, say Bollywood celebrities | Sakshi
Sakshi News home page

సుల్తాన్ సూపర్ హిట్ : బాలీవుడ్ ప్రముఖులు

Published Wed, Jul 6 2016 1:15 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

సుల్తాన్ సూపర్ హిట్ : బాలీవుడ్ ప్రముఖులు - Sakshi

సుల్తాన్ సూపర్ హిట్ : బాలీవుడ్ ప్రముఖులు

సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోపిక్ సుల్తాన్. హరియాణాకు చెందిన ఓ రెజ్లర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా నేడు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్కు ముందు సల్మాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింతగా హైప్ క్రియేట్ చేసుకున్న సుల్తాన్.., భారీ ఓపెనింగ్స్తో సత్తా చాటుతోంది.

సుల్తాన్ సినిమాను వీక్షించిన బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కరణ్ జోహార్, అనుపమ్ ఖేర్, సుభాష్ ఘాయ్ లాంటి సెలబ్రిటీలు సినిమా బ్లాక్బస్టర్ హిట్ అంటూ ప్రకటించేశారు. మంగళవారం బాలీవుడ్ ప్రముఖుల కోసం యష్ రాజ్ స్టూడియోస్లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు.  డైసీషా, నిఖిల్ ద్వివేది, డేవిడ్ ధావన్, సిద్దార్ధ్ రాయ్ కపూర్, సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ లులియాలతో పాటు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీ వచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement