'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు? | Salman Khan’s Sultan to get Rs 150 crore opening? Trade experts begin predicting game | Sakshi
Sakshi News home page

'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు?

Published Tue, Jul 5 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు?

'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు?

ముంబై: 'సుల్తాన్' గత రికార్డులను బ్రేక్ చేయనున్నాడా. బాక్సాఫీస్ లో కొత్త రికార్డు నెలకొల్పనున్నాడా. బుధవారం ఒక్కరోజే 150 కోట్లు కలెక్షన్లు సాధించనున్నాడా. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్' బుధవారం విడుదలవుతున్న నేపథ్యంలో ట్రేడ్ ఎనలిస్టులు బాక్సాఫీస్ కలెక్షన్లు అంచనా వేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. రంజాన్ కానుకగా రేపు విడుదలవుతున్న 'సుల్తాన్' మొదటి వారం కలెక్షన్లు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

ఈ సినిమా ఓపెనింగ్స్ రూ. 160 కోట్లు ఉంటాయని ట్రేడ్ ఎక్స్ఫర్ట్ అముల్ మోహన్ అంచనా వేశారు. సల్మాన్ ఖాన్, యశ్ రాజ్ ఫిలిమ్స్, రంజాన్ రోజున విడుదల ఈ మూడు సమీకరణాల నేపథ్యంలో 'సుల్తాన్'కు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశముందని మరో ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు రెట్టింపవుతూ వచ్చాయని గుర్తు చేశారు. దీంతో 'సుల్తాన్'పై అంచనాలు భారీగా ఉన్నాయని వివరించారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. 'సుల్తాన్'కు జోడిగా అనుష్క శర్మ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement