
చల్నేదో గాడి!
అవుట్‌డోర్ షూటింగ్స్‌లో పాల్గొనే కథానాయికలు షాట్ షాట్‌కి మధ్య ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఎండ, ఉక్కపోతకు తట్టుకోలేక కార్‌వాన్ ఎక్కేసి విశ్రాంతి తీసుకుంటుంటారు. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ మాత్రం నో రెస్ట్ అంటారు. షాట్ గ్యాప్‌లో ఏదో ఒకటి చేస్తుంటారు. ఇటీవల ఏకంగా ట్రాక్టర్ నడిపేశారు. ఆ విషయంలోకి వస్తే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మల్ల యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్’.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ పంజాబ్‌లో జరుగుతోంది. ఈ లొకేషన్‌లోనే అనుష్క ట్రాక్టర్ నడిపారు. ఈవిడగారు ఎంతో నైపుణ్యంగా ట్రాక్టర్ నడిపిన విధానం చూసి, చిత్రబృందం ఆశ్చర్యపోయారు. ఇంతకీ లొకేషన్‌లోకి ట్రాక్టర్ ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా? ఈ సినిమాలో అనుష్క ట్రాక్టర్ నడిపే సీన్ ఒకటుంది. సీన్ తీస్తున్నప్పుడు ట్రాక్టర్ నడిపిన అనుష్కకు ఈ రైడ్ చాలా నచ్చిందట. అందుకే షాట్ గ్యాప్‌లో కూడా స్టీరింగ్ తిప్పారు.