సెట్‌లో కుప్పకూలిన ప్రముఖ హీరో! | Randeep Hooda collapses on Sultan sets, to undergo surgery in Delhi | Sakshi
Sakshi News home page

సెట్‌లో కుప్పకూలిన ప్రముఖ హీరో!

Published Mon, Apr 18 2016 4:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

సెట్‌లో కుప్పకూలిన ప్రముఖ హీరో! - Sakshi

సెట్‌లో కుప్పకూలిన ప్రముఖ హీరో!

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ కథనాయకుడు రణదీప్‌ హుడా 'సుల్తాన్' షూటింగ్‌ సెట్‌లో కుప్పకూలాడు. ఆదివారం 'సుల్తాన్‌' సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అతనికి ఒక్కసారిగా తీవ్రమైన అపెండిసిటిస్‌ అటాక్‌ వచ్చింది. దీంతో బాధతో విలవిలలాడుతూ అతను పడిపోయాడు. రణ్‌దీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో సోమవారం ఆయనకు ఆపరేషన్‌ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

రెజ్లింగ్‌ ఇతివృత్తంతో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా 'సుల్తాన్‌' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌దీప్‌ హుడా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'రణ్‌దీప్‌కు తీవ్రమైన నొప్పి వచ్చింది. అయినా వృత్తి నిబద్ధత కలిగిన ఆయన షూటింగ్‌ను పూర్తయ్యేవరకు నొప్పి తట్టుకోగలిగారు. సెట్‌లో బాధతో పడిపోయిన ఆయనకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు' అని ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ముగిసిన తర్వాత మంగళవారం రణ్‌దీప్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రణ్‌దీప్‌ హుడా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'సుల్తాన్‌' సినిమాతోపాటు 'సరబ్‌జిత్‌', 'లాల్‌ రంగ్‌' చిత్రాల్లో ప్రస్తుతం అతను నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement