ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్‌ ఫ్రెండ్‌! | Randeep Hooda To Marry Girlfriend Lin Laishram In November 2023 | Sakshi
Sakshi News home page

అప్పుడేమో స్టార్ హీరోయిన్‌తో డేటింగ్.. ఇప్పుడేమో ప్రియురాలితో పెళ్లి..!

Published Sun, Nov 5 2023 11:33 AM | Last Updated on Sun, Nov 5 2023 1:54 PM

Randeep Hooda To Marry Girlfriend Lin Laishram In November 2023 - Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే టాలీవుడ్‌లో ఇప్పటికే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట సైతం పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా.. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను ఈనెలలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. 

అయితే రణదీప్, లిన్ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ముంబైలోనే వివాహ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాతే ఈ జంట రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పటివరకు వీరిద్దరు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గానే ఉంచునున్నారు. కాగా.. లిన్ మణిపూర్‌కు చెందిన లిన్ మోడల్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల సందర్బంగా తమ రిలేషన్‌ను ప్రకటించారు. లిన్ బర్త్ డే వేడుకల్లోనూ రణ్‌దీప్‌ హుడా కనిపించారు. 

సుస్మితా సేన్‌తో డేటింగ్!

అయితే రణ్‌దీప్‌ గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 2004లో సుస్మితాసేన్‌తో డేటింగ్‌లో ఉన్న రణ్‌దీప్ 2006లో విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయమని వెల్లడించారు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్న లిన్‌, రణ్‌దీప్‌ మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉంది. ప్రస్తుతం రణ్‌దీప్‌కు 47 ఏళ్లు కాగా.. లిన్‌ 37 ఏళ్ల వయసులో ఉన్నారు.

కాగా.. ప్రస్తుతం రణ్‌దీప్ హుడా అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటించనున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఆ తర్వాత రణదీప్ లాల్ రంగ్ 2: ఖూన్ చుస్వాలో కనిపించనున్నారు. మరోవైపు.. లిన్ చివరిసారిగా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్, ఆక్సోన్ వంటి చిత్రాలలో లిన్ నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement