యూట్యూబ్లో సుల్తాన్ సెన్సేషన్ | Salman Khan's Sultan teaser crosses 15 million views on YouTube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్లో సుల్తాన్ సెన్సేషన్

Published Wed, May 25 2016 11:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

యూట్యూబ్లో సుల్తాన్ సెన్సేషన్

యూట్యూబ్లో సుల్తాన్ సెన్సేషన్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా సుల్తాన్. హరియాణాకు చెందిన ప్రముఖ రెజ్లర్ సుల్తాన్ అలీఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అనుష్క శర్మ సుల్తాన్ ప్రేయసి ఆర్ఫా పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె కూడా రెజ్లర్గా కనిపించేందుకు ఎంతో కష్టపడి మల్లయుద్ధం నేర్చుకుంది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుల్తాన్ అఫీషియల్ టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. యష్ రాజ్ ఫిలింస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్, రిలీజ్ అయిన గంటల వ్యవథిలో 14 లక్షలకు పైగా వ్యూస్తో రికార్డ్ సృష్టించింది. ప్రేమ్ రతన్ ధన్ పాయో తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement