పూర్తయిన 'సుల్తాన్' షూటింగ్ | salman khan Sultan shooting wrapped | Sakshi
Sakshi News home page

పూర్తయిన 'సుల్తాన్' షూటింగ్

Published Tue, Jun 7 2016 1:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

పూర్తయిన 'సుల్తాన్' షూటింగ్

పూర్తయిన 'సుల్తాన్' షూటింగ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య రిలీజ్కు రెడీ అవుతున్న సుల్తాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలిసారిగా సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో, ఈ ఇద్దరు హరియాణాకు చెందిన రెజలర్లుగా నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు.

ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగా, తాజాగా బుడాపెస్ట్లో తీసిన షూటింగ్ పార్ట్తో సినిమా పూర్తయ్యింది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ అనుష్క శర్మ యూనిట్ సభ్యులతో కలిసి ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ముందు నుంచి చెపుతున్నట్టుగా 2016 ఈద్కు సుల్తాన్ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement