'సుల్తాన్ జోడీ' చూడు గురూ..
సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు తొలిసారి జతకట్టనున్న సినిమా 'సుల్తాన్'. చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత సల్మాన్ పక్కన కథానాయికగా అనుష్క ఎంపికైన విషయం తెలిసిందే. అప్పటినుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. ప్రేమికులరోజు సందర్భంగా సల్మాన్, అనుష్కలు జంటగా ఉన్న సుల్తాన్ 'ఫస్ట్ లుక్'ను యూనిట్ విడుదల చేసింది. సరికొత్త జోడీగా సల్మాన్, అనుష్కలు హల్ చల్ చేస్తున్నారు.
క్రీడా నేపథ్యంతోపాటు ఈ సినిమాలో ఓ అందమైన ప్రేమకథ కూడా ప్రేక్షకులను అలరించనుంది. ప్రజల చేత 'హర్యానా కా షేర్' అనిపించుకునే సుల్తాన్.. 'హర్యానా కీ షాన్'గా వెలిగిపోయే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రొఫెషనల్ క్రీడాకారుల మధ్య జరిగే ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు సినిమా యూనిట్. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం 2016లో భారీ ప్రాజెక్టుల లిస్ట్లో చేరడం ఖాయం అంటున్నారు.