
ఆమె రంగూన్ వెళ్లడం వల్లే...
సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వచ్చింది అనేదానిపై రోజుకో పేరు వినిపించింది. దీపిక పడుకొనె, కంగనా రనౌత్‌ల పేర్లు కాస్త గట్టిగానే వినిపించాయి. డేట్ ఇష్యూ వల్ల తాను ‘సుల్తాన్’లో నటించడం లేదని కంగానా తేల్చేసింది. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’లో కంగనా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యత ‘సుల్తాన్’కు ఇవ్వకపోవడం, పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే దర్శక,నిర్మాతలు వేరే హీరోయిన్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందట. గమనించాల్సిన విషయం ఏమిటంటే, సల్మాన్‌ఖాన్ ‘బజ్‌రంగి బైజాన్’ సినిమాలో కూడా హీరోయిన్‌గా అవకాశం వచ్చినా... ఏవో కారణాల వల్ల ఆ సినిమా చేయనంది కంగనా.
‘సుల్తాన్’ సినిమాలో కంగనా కాదు... దీపిక పడుకొనె హీరోయిన్ అనుకునేలోపు ఇప్పుడు కొత్తగా పరిణితి చోప్రా పేరు వినిపిస్తోంది. పెద్దగా హిట్‌లు లేని చోప్రాకు సల్మాన్ సరసన నటించే అవకాశం రావడం వింతే అంటున్నారు. ‘సుల్తాన్’ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ నుంచే బాలీవుడ్‌లోకి ప్రవేశించింది పరిణితి.
పెద్ద ప్రాజెక్ట్‌ల్లో... రేపు షూటింగ్ అనగా కూడా పేర్లు మారుతుంటాయి. చూద్దాం మరి... చోప్రాకు ఎంత అదృష్టం ఉందో!