సల్మాన్ స్పీడు పెంచాడు
గత ఏడాది భజరంగీ బాయిజాన్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఆ రికార్డ్కు ఏడాదిలో కాలం చెల్లిపోయింది. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్లుభాయ్ తన రికార్డ్ను తానే తిరగరాస్తున్నాడు. ఇప్పటికీ భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్గా రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉందంటున్నారు.
అయితే అభిమానులు రికార్డుల లెక్కలేస్తుంటే.., సల్మాన్ మాత్రం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కబీర్ ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ సినిమాకు ఓకె చెప్పేశాడు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ఏక్తా టైగర్, భజరంగీ బాయిజాన్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ట్యూబ్ లైట్పై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో సల్మాన్ కెరీర్కు బూస్ట్ ఇచ్చిన దబాంగ్ సీరీస్లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మరోసారి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్వకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను సీక్వల్గా కాకుండా చుల్ బుల్ పాండే పోలీస్ ఎలా అయ్యాడు అనే కాన్సెప్ట్తో ప్రీక్వల్గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటించనుంది.