Rupert Murdoch And Jerry Hall Are Said To Be Divorcing - Sakshi
Sakshi News home page

నాలుగో భార్యకూ మర్డోక్‌ విడాకులు

Published Fri, Jun 24 2022 4:31 AM | Last Updated on Fri, Jun 24 2022 10:03 AM

Rupert Murdoch and Jerry Hall Are Said to Be Divorcing - Sakshi

లండన్‌: మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌(91) నాలుగో భార్య జెర్రీ హాల్‌(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్‌ లండన్‌లో 2016లో వివాహమాడారు. మర్డోక్‌ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు తెలిసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్‌ ఆస్తులు ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్‌ నిర్వహిస్తున్నారు. న్యూస్‌ కార్ప్, ఫాక్స్‌ కార్ప్‌ల్లో మర్డోక్‌కు వాటా 40% వాటా ఉంది.   మర్డోక్‌ తన మొదటి భార్య, ఫ్లైట్‌ అటెండెంట్‌ అయిన పాట్రిసియా 1966లో విడిపోయారు.  రెండో భార్య అన్నా నుంచి 1999లో, మూడో భార్య వెండీ డెంగ్‌తో 2014లో విడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement