Jerry Hall
-
నాలుగో భార్యకూ మర్డోక్ విడాకులు
లండన్: మీడియా దిగ్గజం, బిలియనీర్ రూపర్ట్ మర్డోక్(91) నాలుగో భార్య జెర్రీ హాల్(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్ లండన్‌లో 2016లో వివాహమాడారు. మర్డోక్ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్ ఆస్తులు ఫోర్బ్స్ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్ నిర్వహిస్తున్నారు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్‌ల్లో మర్డోక్‌కు వాటా 40% వాటా ఉంది. మర్డోక్ తన మొదటి భార్య, ఫ్లైట్ అటెండెంట్ అయిన పాట్రిసియా 1966లో విడిపోయారు. రెండో భార్య అన్నా నుంచి 1999లో, మూడో భార్య వెండీ డెంగ్‌తో 2014లో విడిపోయారు. -
నాలుగో భార్యకు మీడియా మొఘల్ విడాకులు
పెళ్లిని నూరేళ్ల పంటగా అభివర్ణించారు పెద్దలు. కానీ ఈ కాలంలో మాత్రం ఈ మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే నువ్వు నాకొద్దు బాబోయ్ అంటూ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పెళ్లి, విడాకులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మీడియా మొఘల్ రూపర్ట్ ముదోర్చ్, మోడల్, నటి జెర్రీ హాల్ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కలిసి ఉండలేమంటూ విడాకులు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఫాక్స్ కంపెనీ చైర్మన్, సీఈవో అయిన రూపర్ట్‌కు ఇదివరకే మూడు విడాకులు కాగా ఇది నాలుగవది. 1956లో అతడు పార్టీసియా బుకర్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1967లో ఆమెకు విడాకులిచ్చేసి అదే ఏడాది అన్నా మరియాను వివాహమాడాడు. 32 ఏళ్ల పాటు ఆమెతో కలిసున్న అతడు 1999లో వెండి డెంగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2013లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. అనంతరం 2016లో మోడల్, నటి జెర్రీని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న రూపర్ట్ ఇప్పుడు ఆమెకు కూడా విడాకులిస్తుండటం గమనార్హం. ఇక జెర్రీ హాల్ విషయానికి వస్తే ఆమె బ్యాట్మన్, ద గ్రాడ్యుయేట్ వంటి చిత్రాల్లో నటించింది. గతంలో సింగర్ మిక్ జాగర్ను పెళ్లాడిన ఆమె తర్వాత అతడితో విడిపోయింది. ఈ పెళ్లిళ్ల ద్వారా రూపర్ట్, జెర్రీలకు మొత్తం 10 మంది పిల్లలున్నారు. చదవండి: అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి
లండన్: ఐదు నెలల ప్రణయ సల్లాపాలకు శుభం కార్డు వేస్తూ.. 84 ఏళ్ల రూపర్ట్ మర్డోక్ మళ్లీ పెళ్లి కొడుకు అయ్యాడు. మాజీ సూపర్ మోడలైన తన ప్రేయసి జెర్రీ హాల్ (59)ను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. లండన్‌లోని ప్రిన్స్ డయానా పూర్వీకుల రాజభవనమైన స్పెన్సర్ హౌజ్‌లో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. మీడియా మొఘల్, న్యూస్ క్రాప్ చైర్మన్ అయిన మర్డోక్ ఐదు నెలల కిందట ఆస్ట్రేలియాలో జెర్రీ హాల్‌ను కలిశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన ఈ ముదిమి ప్రేమికుడు ఐదునెలలుగా జెర్రీతో డేటింగ్ చేస్తున్నాడు. గత అక్టోబర్‌లో లండన్‌లో రగ్బీ యూనియన్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఫొటోలకు పోజు ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తమ బంధాన్ని పెళ్లి వైపు నడిపిస్తూ గత జనవరిలో లాస్ ఏంజిల్స్‌లో ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుబేరుడైన మర్డోక్ జెర్రీ చేతివేలికి అక్షరాల 4.2 మిలియన్ పౌండ్ల ఉంగరం తొడిగారు. ఈ ఇద్దరి వివాహం కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య సాదాసీదాగా జరిగినప్పటికీ, శనివారం లండన్‌లోని చారిత్రక సెయింట్ బ్రైడ్స్ చర్చిలో వివాహ విందు ఘనంగా జరుగనుంది. తమ పెళ్లి అనంతరం మర్డోక్ స్సందిస్తూ తాను ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అని ట్వీట్ చేశాడు. 'రానున్న పదిరోజులు లాదా మరెప్పుడు ట్వీట్స్ చేయను. ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అనే భావన కలుగుతోంది' అని ఆయన పేర్కొన్నాడు.