
కెనడా బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను అరెస్ట్ అయ్యారు.1980 నుంచి 2023 వరకు బిలియనీర్ ఫ్రాంక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. దీంతో టొరంటో శివారు ప్రాంతం అరోరాలో వ్యాపారవేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాంక్‌పై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు.
ఫ్రాంక్ స్ట్రోనాచ్ కెనడా మ్యాగ్నా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీ ఆటోమొబైల్ పార్ట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. కొద్ది సేపటికే విడుదలయ్యారు. ఆంటారియో కోర్టులో హాజరుకానున్నారు. స్ట్రోనాచ్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని అతని తరపు లాయర్ బ్రియాన్ గ్రీన్‌స్పాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment