బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా, అతని భార్య మిచెల్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన భవనం విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. ఈ విశాలమైన.. విలాసవంతమైన భవనం ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటి. దీనిని 'పూనావాలా మాన్షన్' అని పేరు పెట్టారు.
యోహాన్ పూనావాలా.. పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన తండ్రి జవరాయ్ పూనావల్లా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్. కాబట్టి యోహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. యోహన్ భార్య మిచెల్ పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్.
రూ.500 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త భవనం విశాలమైన లేఅవుట్స్, విశాలమైన డాబాలను కలిగి ఉంది. ఇందులో కొంత భాగాన్ని పూనావాలా ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇందులో మిచెల్ ఆయిల్ పెయింటింగ్‌లు, ఇతర విలువైన మొక్కలు ఉంటాయి.
ముంబైలో ఆస్తులను కలిగి ఉన్న ప్రముఖులు
దక్షిణ ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్లీ 'ఓంకార్ 1973' ప్రాజెక్ట్‌లో 34 కోట్ల విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను, రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ 30 కోట్ల ఆస్తిని & యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?
క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ నిర్మాత, డైరెక్టర్ 'దినేష్ విజన్' కూడా ముంబైలోని 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని, అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment