Billionaire Media Mogul Rupert Murdoch Set To Marry For 5th Time At Age 92 - Sakshi
Sakshi News home page

ఇదే చివరిది.. ఐదో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త!

Published Tue, Mar 21 2023 1:08 PM | Last Updated on Tue, Mar 21 2023 1:54 PM

Billionaire Media Mogul Rupert Murdoch Set To Marry For 5th Time At 92 - Sakshi

గతంలో పెళ్లికి వెళ్లిన బంధువులు, సన్నిహితులు వధూవరులను నిండు నూరేళ్లు కలిసి జీవించమని ఆశీర్వదించేవాళ్లు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం.. అలా చెప్పరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వివాహ మండపంలో జీవితాంతం చేయి వదలనన్న ప్రమాణాన్ని వధూవరులు మరుస్తున్నారు. ఏదో ఒక కారణంతో దాంపత్య జీవితాన్ని ఫుల్‌ స్టాప్‌ పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్‌ నడుస్తుందనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఏకంగా తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. మరి అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదే లాస్ట్‌ అనుకుంటా..
ప్రముఖ ఆస్ట్రేలినయన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మార్దొక్ మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు. ఈయనకు వ్యాపారం రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 92 ఏళ్ల వ్యాపారవేత్త తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు.

కొన్ని నెలల కిందటే శాన్ ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి విషయాన్ని స్మిత్‌కు చెప్పగా.. ఆమె కూడా అంగీకరించింది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, మార్దొక్ ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు. వీళ్లిద్దరి వ్యక్తిగత విషయాలను చూస్తే.. స్మిత్ ఇంతకుముందు దేశీయ గాయకుడు, రేడియో టీవీ ఎగ్జిక్యూటివ్ చెస్టర్ స్మిత్‌ను వివాహం చేసుకుంది. అతను ఆగస్టు 2008లో మరణించాడు.

ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్ కు రూపర్ట్ తో పరిచయం ఏర్పడి, అది కాస్త పెళ్లికి వరకు వెళ్లింది. ఇక రూపర్ట్ మార్దోక్‌కి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యి.. ఆరుగురు పిల్లలు ఉన్నారు.  ముర్డోక్ తన నాల్గవ భార్య, మాజీ టాప్ మోడల్ అయిన జెర్రీ హాల్‌కు గతేడాది ఆగస్టులో విడాకులు ఇచ్చని సంగతి తెలిసిందే.  మర్డోక్ వ్యాపార సామ్రాజ్యంపై ఓ లుక్కేస్తే.. యూఎస్‌లోని ఫాక్స్ న్యూస్, యూకేలోని రైట్‌వింగ్ టాబ్లాయిడ్ ది సన్ ఉన్నాయి. అతను న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, పబ్లిషింగ్ హౌస్ హార్పర్ కాలిన్స్‌లకు న్యూస్ కార్పొరేషన్ అధిపతిగా కొనసాగుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement