దేశంలో వివిధ రంగాల్లో అనేక స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయి. విభన్నమైన వ్యూహాలతో విజయ పథంలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విజయవంతమైన పలు స్టార్టప్‌లు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి టెండ్రిల్స్ నేచురల్స్.
మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ సూక్ష్మ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పని చేస్తుంది. ప్రారంభంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతుల ద్వారా ఈ మొక్కల నుంచి సేకరించిన నూనె నుంచి సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు.
తర్వాత క్రమంగా పలు సేంద్రియ ఉత్పత్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా నెలకు రూ.5 లక్షలకు పైగా విక్రయాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీని వ్యవస్థాపకుడు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment