సాక్షి, హైదరాబాద్ః స్టార్టప్ రంగంలోని అవకాశాలను యువత అందుకునే దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య తను ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, అగ్రి హబ్ వంటి అనేక వేదికలను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన ‘ఫౌండర్స్ ల్యాబ్’ను కేటీఆర్ బుధవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా శిక్షణ అందించడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. ఫౌండర్స్ ల్యాబ్ సీఈఓ శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ..వివిధ విద్యాసంస్థలు, వర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని వెల్లడించారు.
ఫార్మా, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్ రంగాలను ఇంజనీరింగ్ రంగాలతో అనుసంధానం చేస్తూ ఆవిష్క రణలను విద్యార్థుల ద్వారా వెలికితీసే అవకాశం ఉందన్నారు. కార్య క్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఫౌండర్ ల్యాబ్ డైరెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment