దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చదువు పూర్తయిన తర్వాత యువత ఉద్యోగం చేయడం కంటే కొత్త కంపెనీలు స్థాపించడంపైనే మక్కువ చూపుతున్నారు. విభిన్న ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు స్థాపిస్తున్నారు. ప్రాథమిక దశలో మూలధన పెట్టుబడులకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నా, కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ లభించాక ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అలా విభిన్న రంగాల్లో కొత్త స్టార్టప్‌లు వెలుస్తున్నాయి. ప్రధానంగా ఏఐ ఆధారిత సంస్థలు భవిష్యత్తులో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో కొన్ని ఏఐ స్టార్టప్‌ల గురించి తెలుసుకుందాం.
జీబ్రా మెడికల్ విజన్: వ్యాధుల నిర్ధారణలో రేడియాలజిస్ట్‌లకు సహాయం చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. మెడికల్ ఇమేజింగ్ అనలిటిక్స్‌లో వైద్యులకు ఈ సంస్థ తోడ్పడుతుంది.
నిరామై: మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల క్యాన్సర్ పెరుగుతోంది. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఈ సంస్థ ఏఐ సహాయంతో థర్మల్ ఇమేజింగ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు సహాయపడుతుంది.
క్యూర్‌మెట్రిక్స్: రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేందుకు ఈ సంస్థ ఏఐను తయారు చేస్తోంది. ఎక్స్-రే ఇమేజింగ్ ద్వారా మమోగ్రఫీ విధానాన్ని ఉపయోగించి ఇతర చాతి సంబంధిత వ్యాధులను నిర్ధారిస్తుంది.
సిగ్‌టుపుల్: ప్రాథమికంగా పాథాలజీ, మైక్రోస్కోపీలో వైద్య డేటాను విశ్లేషించి ఆటోమేట్ చేసేందుకు వీలుగా ఏఐను రూపొందించారు.
ఫ్రాక్టల్ అనలిటిక్స్: వివిధ పరిశ్రమల్లో సంక్లిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఏఐను తయారు చేశారు.
ఇదీ చదవండి: ‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగం
అగ్రకూల్: పంట నిర్వహణపై దృష్టి సారించి వ్యవసాయ రంగానికి ఏఐ ఆధారిత పరిష్కారాలు అందిస్తుంది.
వోబోట్: వ్యాపారాల కోసం ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ సేవలందిస్తుంది.
అన్‌కనీ విజన్: భద్రత, నిఘా కెమెరాలు మరింత పటిష్టంగా పనిచేసేందుకు ఏఐ అప్లికేషన్‌ల ద్వారా కంప్యూటర్ విజన్ టెక్నాలజీని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment