Springworks Ceo Receives 3,000 Resumes In 48 Hours - Sakshi
Sakshi News home page

2 రోజుల్లో వేల రెజ్యూమ్‌లు, ఆ జాబ్‌ వస్తే చాలంటూ.. క్యూ కడుతున్న ఉద్యోగులు!

Published Mon, Jul 17 2023 7:43 PM | Last Updated on Mon, Jul 17 2023 8:19 PM

Springworks Ceo Receives 3,000 Resumes In 48 Hours - Sakshi

కోవిడ్‌-19, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాంద్యం భయాలతో చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి బడా బడా కార్పొరేట్‌ కంపెనీల వరకు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో తొలగింపుకు గురైన ఉద్యోగులు, లేదంటే ఇతర కారణాల వల్ల ఏ చిన్న సంస్థలో ఉద్యోగం దొరికినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అయితే ప్రత్యేకంగా చెప్పనక‍్కర్లేదు. జీతం తక్కువైనా స్టార్టప్స్‌కు జై కొడుతున్నారు. 

తాజాగా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ స్ప్రింగ్‌ వర్క్‌ సంస్థ పలు విభాగాల్లో విధులు నిర్వహించేందుకు అభ్యర్ధులు కావాలని పోస్ట్‌ చేసింది. అంతే ఆ సంస్థలో ఉద్యోగానికి కేవలం 48 గంటల్లో 3వేల మందికి పైగా రెజ్యూమ్‌లు పంపారు.  
 

దీనిపై ఆ సంస్థ సీఈవో కార్తీక్ మండవిల్లే స్పందించారు. మా వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌ పోస్ట్‌ ఉద్యోగ ప్రకటన చేసిన 48 గంటల్లో మూడు వేలకు పైగా రెజ్యూమ్‌లు వచ్చాయి. జాబ్‌ మార్కెట్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అని ట్వీట్‌ చేశారు. స్పింగ్‌ వర్క్‌ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగానికి టెక్నాలజీ ఆధారిత సేవల్ని అందిస్తుంది. తన కంపెనీలో వివిధ పాత్రల కోసం ఇప్పటివరకు దాదాపు 13,000 దరఖాస్తులు వచ్చాయని మాండవిల్లే చెప్పారు. అయితే, ఈ కంపెనీకి వేల రెజ్యూమ్‌లు పంపడానికి ప్రధాన కారణం రిమోట్‌ వర్కేనని తెలుస్తోంది. 


 
దీనిపై ఓ యూజర్‌.. మీ జాబ్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాబట్టి అన్ని రెజ్యూమ్‌లో వచ్చాయని అనుకుంటున్నాను. అదే ఆఫీస్‌ నుంచి వర్క్‌ చేయాలంటే ఆ సంఖ్య తక్కువగా ఉండేదని కామెంట్‌ చేశాడు. ‘నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. కాలేజీలో నేర్చుకున్నదానితో సంబంధం లేకపోయినా యువత ఉద్యోగాల కోసం తహతహలాడుతున్నారు’ అని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి స్టార్టప్‌లో ఉద్యోగం జాబ్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిగ్గా మారింది. 

చదవండి👉 అసలేం జరుగుతోంది?, టీసీఎస్‌ ఇలా చేస్తుందని అనుకోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement