రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్‌ | Meet Pranjali Awasthi builts rs100 crore AI firm in 1 year | Sakshi
Sakshi News home page

రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్‌

Published Fri, May 17 2024 3:45 PM | Last Updated on Fri, May 17 2024 5:00 PM

Meet Pranjali Awasthi builts rs100 crore AI firm in 1 year

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు  టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్‌తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.  రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్‌ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో  పది మందికి  ఉపాధి కల్పిస్తోంది. 

ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది.  డెల్వ్.ఏఐ  లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి  ఉండటం విశేషం.

పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి  ఉన్నతికి పునాది వేశారు.  ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది.  ఆమెకు 11 ఏళ్లున్నపుడు  కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 

13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఆమె ఇంటర్న్‌షిప్  ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్‌షిప్ సమయంలో, కోవిడ్‌ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలోకి ప్రవేశించింది.  ఓపెన్‌ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్‌ కూడా మొదలైంది.

హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. 

ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది.  కేవలం ఒక ఏడాదిలోనే  రూ100 కోట్లకు చేరింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement