స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్ పరిశ్రమలో సూపర్‌వుమన్ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం.
రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.
అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా
2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్‌ఫారమ్ ఆఫ్ బిజినెస్‌ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్‌బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.
2017లో, కల్రా వారి ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్‌బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.
మహిళలకు సందేశం
‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్‌లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’
పెద్ద పెద్ద స్టార్టప్‌లు చేయలేని ఫీట్‌ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు.
Comments
Please login to add a commentAdd a comment