రాత్రిపూట కూడా సన్‌లైట్‌ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..? | Startup Reflect Orbital Aims To Sell Sunlight At Night | Sakshi
Sakshi News home page

రాత్రిపూట కూడా సన్‌లైట్‌ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?

Published Mon, Sep 23 2024 2:33 PM | Last Updated on Mon, Sep 23 2024 2:35 PM

Startup Reflect Orbital Aims To Sell Sunlight At Night

మనకు నచ్చిన ఫుడ్‌ని ఏం టైంలో అయినా ఆర్డర్‌ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్‌ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్‌లైట్‌ని ఆర్డర్‌ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనే స్టార్టప్‌ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్‌ ఫ్యానెల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ​ ఈ సూర్యకాంతి ఆఫ్‌ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. 

ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకుడు సీఈవో బెన్‌ నోవాక్‌. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్‌లైట్‌ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్‌ ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యిఆర్డర్‌ పెట్టుకుంటే చాలు  మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. 

అందుకోసం  57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్‌ మైలార్‌ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది. 

అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్‌. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తోంది. ఆ బెలూన్‌కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్‌లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌లు ఉంటాయి. 

అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్‌ కంపెనీ. 

అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్‌ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్‌ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్‌ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. 

 

 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!)
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement