Reflect
-
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్‌ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!) -
వునుగడ ప్రశ్నార్థకం
పక్క డిపోలకు తరలివెళుతున్న సర్వీసులు అంతర్రాష్ట్ర, పల్లెవెలుగులకే పరిమితం రెండు నెలల్లో రూ.కోటి నష్టం కుప్పం ఆర్టీసీ డిపో పరిస్థితి ఇదీ కుప్పం, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా వూరింది. అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో కుప్పం డిపో నష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని సర్వీసులు పక్కడిపోలకు తరలించేశారు. పరిస్థితి చక్కదిద్దకుంటే ఈ డిపో ఎంతో కాలం పనిచేయదని పరిశీలకులు అంటున్నారు. కుప్పం ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం 94 సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో అంతర్రాష్ట్ర సర్వీసులు 48, పల్లెవెలుగులు 25, ఎక్స్‌ప్రెస్‌లు 28 సర్వీసులు ఉన్నా రుు. వుూడు నెలల క్రితం కుప్పం- పలవునేరు మధ్య నడిచే 6 ఆర్డినరీలను పలవునేరు డిపోకు పంపించేశారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆరు మంగళం డిపోకు, తిరుమలకు రెండు, చిత్తూరుకు 2 బస్సులను పంపించేశారు. ఫలితంగా కుప్పం నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే సర్వీసులు దాదాపు నిలిచిపోయినట్టే. కర్ణాటక, తమిళనాడుకు వెళ్లే సర్వీసులు, పల్లె వెలుగు సర్వీసులు వూత్రమే కుప్పం డిపో నుంచి నడుస్తున్నారుు. రెండు నెలల్లో రూ.కోటి నష్టం రెండు నెలల్లో కుప్పం ఆర్టీసీ డిపోకు రూ.కోటి నష్టం వాటిల్లినట్టు డిపో అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కొరత.. సక్రవుంగా సర్వీసులు నడపలేక పోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం 470 వుంది కార్మికులు పనిచేస్తున్నారు. బయుట ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు కుప్పం రాలేకపోతున్నారు. ఫలితంగా సిబ్బంది కొరత ఏర్పడింది. బస్సులు ఉన్నా వాటిని నడిపేవారు లేకపోవడంతో డిపో నష్టాల్లో కూరుకుపోయింది. 28 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిపో ఇప్పుడీ కష్టాలు ఎదుర్కోవడం వెనుక ఆంతర్యమేమిటో అధికారులకే ఎరుక. బస్సులు కండిషన్ లేకపోవడం, సమయపాలన పాటించకపోవడంతో ప్రయివేటు వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల సమైక్య ఉ ద్యమం కారణంగా డిపోకు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అధికారుల పర్యవేక్షణ, పాలకుల ఉదాశీన వైఖరి కారణంగా మిగిలిన నష్టాన్ని మూటగట్టుకోవా ల్సి వచ్చిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రధాన నగరాలకు వెళ్లాలంటే కష్టమే తిరుపతి, చిత్తూరు, వుదనపల్లె పట్టణాలకు వెళ్లాలంటే కుప్పం నుంచి బస్సు సర్వీసులు లేవు. ఉన్న ఒకటి రెండు సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారు పక్క డిపోలకు వెళ్లి బస్సులెక్కాల్సి వస్తోంది. ఆర్టీసీ మనుగడపై స్థానిక ఎమ్మెల్యేగానీ, అధికారులు గానీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించాలని పలువురు కోరుతున్నారు.