- పక్క డిపోలకు తరలివెళుతున్న సర్వీసులు
- అంతర్రాష్ట్ర, పల్లెవెలుగులకే పరిమితం
- రెండు నెలల్లో రూ.కోటి నష్టం
- కుప్పం ఆర్టీసీ డిపో పరిస్థితి ఇదీ
కుప్పం, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా వూరింది. అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో కుప్పం డిపో నష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని సర్వీసులు పక్కడిపోలకు తరలించేశారు. పరిస్థితి చక్కదిద్దకుంటే ఈ డిపో ఎంతో కాలం పనిచేయదని పరిశీలకులు అంటున్నారు.
కుప్పం ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం 94 సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో అంతర్రాష్ట్ర సర్వీసులు 48, పల్లెవెలుగులు 25, ఎక్స్‌ప్రెస్‌లు 28 సర్వీసులు ఉన్నా రుు. వుూడు నెలల క్రితం కుప్పం- పలవునేరు మధ్య నడిచే 6 ఆర్డినరీలను పలవునేరు డిపోకు పంపించేశారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆరు మంగళం డిపోకు, తిరుమలకు రెండు, చిత్తూరుకు 2 బస్సులను పంపించేశారు. ఫలితంగా కుప్పం నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే సర్వీసులు దాదాపు నిలిచిపోయినట్టే. కర్ణాటక, తమిళనాడుకు వెళ్లే సర్వీసులు, పల్లె వెలుగు సర్వీసులు వూత్రమే కుప్పం డిపో నుంచి నడుస్తున్నారుు.
రెండు నెలల్లో రూ.కోటి నష్టం
రెండు నెలల్లో కుప్పం ఆర్టీసీ డిపోకు రూ.కోటి నష్టం వాటిల్లినట్టు డిపో అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కొరత.. సక్రవుంగా సర్వీసులు నడపలేక పోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం 470 వుంది కార్మికులు పనిచేస్తున్నారు. బయుట ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు కుప్పం రాలేకపోతున్నారు. ఫలితంగా సిబ్బంది కొరత ఏర్పడింది. బస్సులు ఉన్నా వాటిని నడిపేవారు లేకపోవడంతో డిపో నష్టాల్లో కూరుకుపోయింది. 28 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిపో ఇప్పుడీ కష్టాలు ఎదుర్కోవడం వెనుక ఆంతర్యమేమిటో అధికారులకే ఎరుక. బస్సులు కండిషన్ లేకపోవడం, సమయపాలన పాటించకపోవడంతో ప్రయివేటు వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల సమైక్య ఉ ద్యమం కారణంగా డిపోకు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అధికారుల పర్యవేక్షణ, పాలకుల ఉదాశీన వైఖరి కారణంగా మిగిలిన నష్టాన్ని మూటగట్టుకోవా ల్సి వచ్చిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రధాన నగరాలకు వెళ్లాలంటే కష్టమే
తిరుపతి, చిత్తూరు, వుదనపల్లె పట్టణాలకు వెళ్లాలంటే కుప్పం నుంచి బస్సు సర్వీసులు లేవు. ఉన్న ఒకటి రెండు సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారు పక్క డిపోలకు వెళ్లి బస్సులెక్కాల్సి వస్తోంది. ఆర్టీసీ మనుగడపై స్థానిక ఎమ్మెల్యేగానీ, అధికారులు గానీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించాలని పలువురు కోరుతున్నారు.