
కొన్ని బాధకరమైన ఘటనలు మన అంతర్గత శక్తిని ప్రేరేపించి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. అలా కాకుండా ఆ పరిస్థితికి కలత చెందకుండా..ఎలా ఫేస్ చేద్దామనే ఆలోచనే మనల్ని కార్యోన్ముఖులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఆ విధంగానే ఈ తల్లి స్టార్టప్‌ని పెట్టేందుకు దారితీసి ఓ గొప్ప వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఏడాదికి రూ. 9 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. ఒక సాధారణ గృహిణి అయిన ఆ తల్లి ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగిందో చూద్దామా..!.
కర్ణాటకకు చెందిన లక్ష్మీ ప్రియ విజయగాథ ఎందరికో ఆదర్శం. ఆమె కొడుకు అనారోగ్యమే ఆమెలో దాగున్న అసాధారణ వ్యాపారవేత్తను బయటకు తీసుకొచ్చింది. లక్ష్మికి నెలలు నిండకుండానే పుట్టిన కొడుకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను స్టార్టప్ పెట్టుందుకు దారితీశాయి. ఆమెకు పుట్టిన నవజాత శిశువు నెలల నిండకుండా జన్మించడంతో సుమారు 21 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ శిశువులో పెద్దగా మెరుగుదల కనిపించపోగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
బతుకుతాడనేది చెప్పలేమని వైద్యులు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా ఆ చిన్నారికి తల్లి ఒడిలోవెచ్చదనం అందించి ప్రయత్నిద్దామని చెప్పడంతో..అలా చేసిన కొద్దిసేపట్లోనే ఏదో అద్భుతం జరిగినట్లుగా కోలుకోవడం జరిగింది ఆ శిశువు. పల్స్ రేట్ పెరిగి బతికి బట్టకట్టాడు.
కానీ ఆ తర్వాత కూడా లక్ష్మీ కొడుకు బలహీనమైన రోగనిరోధకశక్తితో ఇబ్బంది పడేవాడు. శరీరంలో తగినంత స్థాయిలో రక్తం కూడా లేకపోవడం వంటి రుగ్మతనలు ఎదర్కొన్నాడు. దీనికి పోషకాహార లోపమని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ దిశగా వంటగదిలో ప్రయోగాలు చేసేది. తన కొడుకు పోషకాహార లోపంతో బాధపడకూదన్న ఆమె సంకల్పం పాలకూర వంటి ఆకుకూరలపై దృష్టిసారించేలా చేసింది.
తనలాంటి తల్లలకు సహాయం అందించేలా చేయాలనే తపన, తన కొడుకు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే బలమైన కోరిక వెరసీ ఆమెను పాలకూర స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది. పాలకూరలో ఉండే విటమిన్లు పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయని న్యూట్రిషన్ల ద్వారా తెలుసుకుంది. ఆకుకూరల గొప్పతనం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలే ఆమెను పాలకూరతో రకరకాల వంటకాలు చేసేందుకు పురిగొలిపింది.
కానీ ఈ పాలకూర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా దాన్ని ఎండలో బెట్టి పౌడరు చేసుకుని రకరకాల వంటకాలు ఎలా చేయొచ్చని ప్రయోగాల చేసింది. అలా ఆమె తానే స్వయంగా పాలకూర పొడులకు సంబంధించిన తినాసరి కీరై స్టార్టప్ పెట్టి విక్రయించడం ప్రారంభించింది.
ఈ స్టార్టప్‌లో పాలకూరకు సంబంధించిన 40 రకాలు పొడుల మిక్స్‌లు ఉంటాయి. పాలకూరని కన్నడలో కీరై అని పిలుస్తారు. అందులోని వెరైటీలు ప్రధానంగా మనథక్కలి, కాసిని, ముదకథన్ , అగతి కరిసలంగన్నితో దాదాపు 15 రకాల వంటకాలను రూపొందించింది. ఈ లోగా కొడుకు కూడా ఆరోగ్యవంతుడయ్యాడు. క్రీడల్లో ఛాంపియన్‌గా కూడా రాణించే స్థాయికి చేరుకున్నాడు
తన సొంత జ్ఞానంతో పెట్టిన ఈ స్టార్టప్‌తో ప్రారంభంలో పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ పొడులతో దోసెలు, సూప్‌లు, బియ్యం మిశ్రమాలు వంటి వాటిని కూడా చేర్చింది. వీటి గురించి తన కొడుకు స్నేహితుల తల్లిదండ్రులకు పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో తన స్టార్టప్‌లో విక్రయించే ఈ పాలకూర పొడుల ప్రాముఖ్యత గురించి వివరించేది. పైగా పాలకూర కొని చేయడం కంటే ఈ మిక్స్‌లతో సులభంగా వండటమేగాక మంచి పోషకాహారాన్ని అందిస్తామన్న ఆమె వివరణ ఎందరో తల్లిదండ్రులను ఆకర్షించింది.
సులభంగా వండగలమన్న విధానం ప్రజలను ప్రభావితం చేసి.. కొనేందుకు ముందుకు వచ్చారు. అందులోనూ పిల్లలకు ఆకుకూరల తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటివి అయితే సులభంగా తింటారు, పైగా పోషకాలు అందుతాయన్న ఆశతో కొనేందుకు ముందుకు రావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్ల పెరగడం తోపాటు ఆర్డర్లు కూడా వచ్చేవి.
అందుకు తగ్గట్టుగానే ఐఎస్‌ఓ(ISO)-సర్టిఫైడ్ పద్ధతులను అవలంబించడం, తన బ్రాండ్ నాణ్యతలో రాజీపడకుండా అందించి ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అలా అనాతి కాలంలోనే వార్షిక అమ్మకాలు రూ. 9 లక్షలకు చేరుకోవడంతో చిన్న వంటగది ప్రయోగాలు కాస్త ఓ పెద్ద బిజినెస్‌గా మారి దూసుకుపోయేందుకు కారణమైంది.
అంతేగాదు లక్ష్మీ స్టార్టప్ ఈ స్టార్టప్ ఇప్పుడు భారతదేశం దాటి విస్తరించింది, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి సుదూర ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
చివరగా పోషకాహార నిపుణురాలు పద్మజ గుత్తికొండ, పాలకూర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. పాలకూరలో కెరోటినాయిడ్లు, విటమిన్లు సీ, కే, ఫోలిక్ ఆమ్లం , కాల్షియంలకు మూలం అని ఆమె అన్నారు.
ఇది కంటి ఆరోగ్యం, ప్రేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ప్రతిరోజూ పిల్లల ఆహారంలో లేదా వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేర్చడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడమే గాక కంటి చూపుకి ఢోకా ఉండదని చెబుతున్నారు.
(చదవండి: టైప్ 2 డయాబెటిస్‌కి మొక్కల ఆధారిత ఔషధం..! ట్రయల్స్‌లో షాకింగ్ ఫలితాలు)
Comments
Please login to add a commentAdd a comment