పీయూష్ గోయల్‌కు వినతిపత్రం అందజేస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కేంద్ర కాఫీబోర్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం ఆమె కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
15వ ఆర్థిక సంఘం ద్వారా ఫైనాన్స్ కమిటీ సూచన మేరకు కేటాయించాల్సిన రూ.1,510 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేసి, కేంద్ర కాఫీ బోర్డును బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ మాధవి తెలిపారు. కాఫీ రైతులకు మేలు కలిగేలా కాఫీబోర్డులో ఖాళీగా ఉన్న 152 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment