సాక్షి, న్యూఢిల్లీ: కాఫీ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును పునర్‌నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖరన్ కూడా ఉన్నారు.
కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్‌దండే, కాఫీ పండించే వారి విభాగంలో విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్తపాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్‌రావు, ఇన్‌స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీశాంత్‌లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది.
కాఫీ బోర్డు సభ్యురాలిగా ఎంపీ మాధవి
Published Wed, Sep 14 2022 5:56 AM | Last Updated on Wed, Sep 14 2022 3:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment