
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ కబురు అందించింది. అత్యవసర సమయాల్లో రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, తత్కాల్‌లో టిక్కెట్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సమయంలో ఎంతో మంది ప్రజలు తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం వల్ల అందరికీ టికెట్ లభించదు. కానీ, రైలు ప్రయాణికుల వెసులుబాటు కోసం ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అదే కన్ఫర్మ్ టికెట్ మొబైల్ యాప్. దీని ద్వారా అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రయాణికులు సులువుగా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వివిధ రైళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, మీరు ప్రయాణించే మార్గంలో అందుబాటులో ఉన్న అన్ని తత్కాల్ టిక్కెట్ల వివరాలను కూడా చూపిస్తుంది. ఈ యాప్‌లో రైళ్ల వివరాలను పొందడం కోసం ప్రయాణీకులు ఇకపై రైలు నెంబర్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు.
ఆండ్రాయిడ్ యూజర్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, "కన్ఫర్మ్ టికెట్" వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు వినియోగదారులు తమ బుకింగ్‌ను నిర్ధారించే ముందు వారి ప్రయాణ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తుది బుకింగ్‌ను ఎంచుకున్నప్పుడు వివరాలు సేవ్ చేయడం వల్ల సులువుగా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
(చదవండి: హైదరాబాద్ మెట్రో.. ఊపిరి పీల్చుకో..)
Comments
Please login to add a commentAdd a comment