Tatkal booking
-
టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్ బుకింగ్ వెబ్సైట్ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్! ట్రైన్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్ సేవల కోసం ఆన్లైన్లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్సీటీసీ సర్వర్ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టికెట్ బుకింగ్ కోసం యూజర్లు లాగిన్ చేస్తున్న సమయం నుంచి పేమంట్ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్ బుకింగ్ కోసం అమౌంట్ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్ అయినప్పటికీ రైలు టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్, మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. @IRCTCofficial Still trying to Book ticket through #irctc website. Is it going to work today ? It's been an half an hour now for tatkal ticket slot booking, but still website is not working. pic.twitter.com/fYFuXCaHrj — Prashant waghmare (@Prashan95320710) March 4, 2023 #irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv — 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023 When someone says Bhai #Tatkal_tickets kaat de Me : pic.twitter.com/g96AuufaM5 — Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023 -
రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కబురు అందించింది. అత్యవసర సమయాల్లో రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, తత్కాల్లో టిక్కెట్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సమయంలో ఎంతో మంది ప్రజలు తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండటం వల్ల అందరికీ టికెట్ లభించదు. కానీ, రైలు ప్రయాణికుల వెసులుబాటు కోసం ఇప్పుడు ఐఆర్సీటీసీ ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే కన్ఫర్మ్ టికెట్ మొబైల్ యాప్. దీని ద్వారా అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రయాణికులు సులువుగా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు వివిధ రైళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, మీరు ప్రయాణించే మార్గంలో అందుబాటులో ఉన్న అన్ని తత్కాల్ టిక్కెట్ల వివరాలను కూడా చూపిస్తుంది. ఈ యాప్‌లో రైళ్ల వివరాలను పొందడం కోసం ప్రయాణీకులు ఇకపై రైలు నెంబర్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, "కన్ఫర్మ్ టికెట్" వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు వినియోగదారులు తమ బుకింగ్‌ను నిర్ధారించే ముందు వారి ప్రయాణ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తుది బుకింగ్‌ను ఎంచుకున్నప్పుడు వివరాలు సేవ్ చేయడం వల్ల సులువుగా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో.. ఊపిరి పీల్చుకో..) -
గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్ ?
గ్యాస్ సిలిండర్ అయిపోయిందంటే దాదాపుగా ఇంటి పని సగం ఆగిపోతుంది. ఇంటిల్లిపాది మరో సిలిండర్ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. వేగంగా గ్యాస్ సిలిండర్ అందించేందుకు తత్కాల్ పథకం అందుబాటులోకి తెచ్చారు. అది కూడా పైటల్ ప్రాజెక్టుగా మన హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు. తత్కాల్ స్కీం ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ ఏజెన్సీ వెళ్లడం, ఆన్లైన్ బుక్ చేయడం లేదా ఫోన్లో ఐవీఆర్ఎస్ పద్దతిలో ఇంకో సిలిండర్ బుక్ చేయాల్సి వచ్చేది. ఫుల్ సిలిండర్ ఇంటికి వచ్చేందుకు కనీసం ఆరు గంటల నుంచి ఆరు రోజుల వరకు సమయం పట్టేది. సామాన్యులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చేందుకు తత్కాల్ స్కీమ్ అమలు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించాయి. ముందుగా ఇంధన్ దేశం మొత్తం మీద 28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో 14 కోట్ల కనెక్షన్లు ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్నాయి. దీంతో తత్కాల్ స్కీమ్‌ను ముందుగా ఇండియన్ ఆయిల్ పరిధిలో ఉన్న ఇంధన్ సిలిండర్లకు అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరాన్ని ఎంపకి చేశారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ డివిజన్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. బుకింగ్ ఇలా రెగ్యులర్‌గా గ్యాస్ బుక్ చేసే ఐవీఆర్ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్సైట్, ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లలో తత్కాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి తత్కాల్ పద్దతిలో సిలిండర్ బుక్ చేయగానే.. సదరు ఏజెన్సీకి వెంటనే పుష్ మెసేజ్ వెళ్లిపోతుంది. వారు అక్కడి నుంచి డెలివరీ బాయ్‌కి ఆ మెసేజ్‌ని చేరవేస్తారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ బుక్ అవుతుంది.. డెలివరీకి రంగం సిద్ధమవుతుంది. అరగంటలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గరిష్టంగా 2 గంటలలోపు ఫుల్ సిలిండర్‌ను అందిస్తారు. అందుకు గాను గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ప్రస్తుతం సింగిల్ సిలిండర్ ఉన్న ఇళ్లకే అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఈ తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దేశమంతటా, అందరు వినియోగదారులకు తత్కాల్ సేవలు అందివ్వనున్నారు. చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన -
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త!
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్, యాప్ లో ఆన్లైన్లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఐఆర్సీటీసీ చెల్లింపు గేట్ వే ఐఆర్సీటీసీ-ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది. ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఐఆర్సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని, దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు. చదవండి: ఆధార్ కార్డులో చిరునామాని ఆన్లైన్లో సవరించండి ఇలా! -
ట్రైన్ టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త విధానం
ఐఆర్సీటీసీ ట్రైన్ టిక్కెట్ల బుకింగ్‌ను ఎప్పడికప్పుడు సులభతరం చేస్తోంది. తాజాగా తత్కాల్ లాంటి ఈ-టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త చెల్లింపు విధానాన్ని తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో తత్కాల్ కోటా కింద టిక్కెట్లతో పాటు ఈ-టిక్కెట్లను ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ యూజర్లు బుక్ చేసుకోవచ్చని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పేర్కొంది. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ అనేది పేమెంట్ విధానం. యూజర్లు ముందస్తుగా దీనిలో నగదును డిపాజిట్ చేసి, ఈ-టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడం కోసం తత్కాల్ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రయాణం చేయడానికి ఒక్క రోజు ముందు ఏసీ క్లాస్ తత్కాల్ టిక్కెట్లను ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్లను 11 గంటలకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప తత్కాల్ స్కీమ్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటే, నగదును రీఫండ్ చేయరు. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ ద్వారా ఈ-టిక్కెట్ల బుకింగ్ తొలుత కస్టమర్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి గరిష్టంగా యూజర్లు ఆరు బ్యాంకులను తమ ప్రాధాన్య జాబితాలో ఇవ్వాలి మై ప్రొఫైల్ సెక్షన్లో బ్యాంకు ప్రాధాన్యతలను ఎప్పడికప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ సర్వీసును ఎంపిక చేసుకుని ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు ఇతర డిజిటల్ వాలెట్లను ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకునే ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ కస్టమర్లకు ఉంది తత్కాల్ బుకింగ్ సిస్టమ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి రైల్వే పలు చర్యలను తీసుకుంటోంది. ఒక్క యూజర్ ఐడీ మీద కేవలం రెండు తత్కాల్ టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యముంటుంది. Now #IRCTC e-wallet users can book #rail e-tickets including of #Tatkal quota through IRCTC Rail Connect Android App. Download now! Just log on to https://t.co/s3mX8VqAiN pic.twitter.com/3h4F3Id7WX — IRCTC (@IRCTCofficial) May 1, 2018 -
తత్కాల్ స్కాం: సీబీఐ టెకీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే తత్కాల్ టికెట్ల స్కాం కేసులో సీబీఐ ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ని అరెస్ట్ చేసింది. ఒకేసారి వందల టికెట్లు బుక్ చేసే అక్రమ సాఫ్ట్వేర్ రూపొందించిన ఆరోపణలపై సీబీఐ అసిస్టెంట్ ప్రోగ్రామర్సహా, మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది.అక్రమ సాఫ్ట్వేర్ సాయంతో రైల్వే తత్కాల్ రిజర్వేషన్ల వ్యవస్థ లో అక్రమాలకు పాల్పడిన ప్రోగ్రామర్ అజయ్ గార్గ్‌ను బుధవారం అరెస్టు చేసింది. వీరినుంచి భారీ ఎత్తున నగలు,నగదును స్వాధీనం చేసుకుంది. మంగళవారం రాత్రి ఈ దాడులు నిర్వహించామని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. రూ. 89 లక్షల నగదును, రూ.69 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రెండు బంగారు పట్టీలు(రెండు కిలోలు), 15 ల్యాప్‌ట్యాప్‌లు, 15 హార్డ్ డిస్క్‌లు, 52 మొబైల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు, 10 నోట్‌బుక్స్, ఆరు రౌటర్లు, నాలుగు డోంగ్లెస్, 19 పెన్ డ్రైవ్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గార్గ్‌తోపాటు అతని సన్నిహితుడు అనిల్ గుప్తాను అ రెస్టు చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 2012లో సీబీఐ అసిస్టెంట్ ప్రోగ్రామర్‌గా చేరిన విజయ్ గార్గ్ 2007-11 మధ్య నాలుగు సంవత్సరాల పాటు ఐఆర్సీటీసీలో పనిచేశాడు. ఈ సందర్భంగా రైల్వే టికెటింగ్ సిస్టంలోని లోపాలను గమనించాడు. ఈ నేపథ్యంలోనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. కొంతమందితో కలిసి కుంభకోణానికి నాంది పలికాడు. ఈ సాఫ్ట్‌వేర్‌ను తన అనుచరుడు అనిల్ గుప్తా ద్వారా కొంతమంది ఏజెంట్లకు విక్రయించాడు. జాన్‌పూర్‌లో ఏడుగురు, ముంబైలో ముగ్గరు, మొత్తం10మందిని గుర్తించినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్కో ఏజెంట్ ద్వారా ఒకేసారి వందల తత్కాల్ టికెట్లను బుక్ చేస్తూ.. తద్వారా నిజమైన ప్రయాణీకులను ఇబ్బందుల పాలు చేశారని చెప్పారు. బుకింగ్ ఏజెంట్ల ద్వారా భారీ సంపదను కూడగట్టాడని ముఖ్యంగా బిట్‌కాయిన్స్, హవాలా నెట్వర్క్ ద్వారా ఈ డబ్బులను అందుకున్నట్టు సీబీఐ అధికారులు ప్రకటించారు. అంతేకాదు... ఇప్పటికీ ఐఆర్సీటీసీలో లూప్ హోల్స్ ఇంకా అలానే ఉన్నాయని వ్యాఖ్యానించడం విశేషం. -
నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో మార్పులు
హైదరాబాద్: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సమయాన్ని ఆధారంగా చేసుకొని మార్పులు చేశారు. ఈ విధానం నేటి(సోమవారం) నుంచి అమలులోకి రానుంది. తత్కాల్ రిజర్వేషన్ బుకింగ్‌ను 2 కేటగిరీలుగా విభజించారు. ఏసీ, నాన్ ఏసీ కేటగీరీలుగా చేశారు. రైలు బయలు దేరే ముందురోజు ఉదయం 10 గంటల నుంచి ఏసీ టికెట్ల బుకింగ్, ఉదయం 11 గంటల నుంచి(నాన్ ఏసీ) స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్‌లు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. -
ప్యాసింజర్ ట్రైన్లలో తత్కాల్ రిజర్వేషన్ సదుపాయం!
ఎమర్జెన్సీ రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశ్యంతో పలు ప్యాసింజర్లలో తత్కాల్ రిజర్వేషన్ స్కీమ్ రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ మినహా అన్నిరిజర్వుడ్ క్లాసుల్లో తత్కాల్ స్కీమ్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాజధాని, దురంతో, శతాబ్ది ట్రైన్లతోపాటు మెయిల్స్, ఎక్స్ ప్రెస్ ట్రైన్లలోనే తత్కాల్ స్కీమ్ అందుబాటులో ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో 60 శాతం పైగా ప్రయాణికులు ప్రయాణించిన ప్యాసింజర్ ట్రైన్లలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. అలాంటి పాసింజర్ ట్రైన్లను గుర్తించే పనిని ఆయా జోన్లకే అప్పగించామని రైల్వేశాఖ కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్, హౌరా-చక్రధర్ ప్యాసింజర్, అగర్తలా-ధరమ్ నగర్, రాజ్ కోట్-వెరివల్ ప్యాసింజర్లలో ఈ స్కీమ్ ను అమలు చేస్తామన్నారు. రైల్వే శాఖలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ స్కీమ్ ను అమలు చేయాలనుకుంటున్నామన్నారు. తత్కాల్ ఛార్జీలను సెకెండ్ క్లాస్ బేసిక్ చార్జీపై 10 శాతం, ఇతర క్లాస్ టికెట్ ధరపై 30 శాతం ఉందని.. సెకండ్ క్లాస్ సిట్టింగ్ పై 10 నుంచి 15 రూపాయలు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.