
న్యూఢిల్లీ : శతాబ్ధి, తేజాస్, ఇంటర్‌సిటీ వంటి పలు ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్లకు 25 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సదుపాయం ఉన్న అన్ని రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆయా రైళ్లలో సీట్ల భర్తీతో పాటు రోడ్డు రవాణా, చౌక విమాన ప్రయాణం నుంచి ఎదురవుతున్న పోటీకి చెక్ పెట్టేందుకు ఈ పథకాన్ని రైల్వేలు ముందుకు తెచ్చాయి. ఈ స్కీంలో భాగంగా టిక్కెట్ బేస్ ధరపై 25 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారు. డిస్కాంట్ ధరకు రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ చార్జ్, జీఎస్టీలు అదనం. గత ఏడాది 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తింపచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌ను ఏడాది పొడవునా లేదా సంవత్సరంలో ఒక నెల, లేనిపక్షంలో వారాంతాల్లో అమలు చేయాలా అనే దానిపై రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment