భారతీయ రైల్వే ప్రతీరోజూ సుమారు 8 వేల రైల్వే స్టేషన్ల మీదుగా రైళ్లను నడుపుతుంది. వాటిలో కొన్ని రైళ్లు సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాయి. ఇప్పుడు మనం దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ఐదు రైళ్ల గురించి తెలుసుకుందాం.
వివేక్ ఎక్స్‌ప్రెస్(డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి): ఇది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రత్యేక సిరీస్ కలిగినది. ఇది 4 వేర్వేరు రూట్లలో ప్రయాణం సాగిస్తుంది. ఈ రైలు డుబ్రిగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ఏకంగా 4,273 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పూర్తి ప్రయాణం 80 గంటల 15 నిముషాలు ఉంటుంది.9 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగించే రైలుకు మొత్తం 55 స్టాపులు ఉన్నాయి.
తిరువనంతపురం సెంట్రల్- సిల్చర్ ఎక్స్‌ప్రెస్: ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది గువాహటి వరకూ ప్రయాణం సాగిస్తుంది. దీనిని 2017 నవంబరు 21న సిల్చర్ వరకూ పొడిగించారు. ఇది భారతదేశంలో అత్యంత దూర ప్రయాణం సాగించే రెండవ రైలు.
హిమసాగర్ ఎక్స్‌ప్రెస్(జమ్ము తావి నుంచి కన్యాకుమారి): ఇది వారాంతపు ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడులోని కన్యాకుమారి నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కొలువైన జమ్ము వరకూ ప్రయాణిస్తుంది. దేశంలో సుదీర్ఘ ప్రయాణం సాగించే రైళ్లలో ఇది మూడవది. 12 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైలుకు 73 స్టాపులు ఉన్నాయి.
టెన్ జమ్ము ఎక్స్‌ప్రెస్(తిరునెల్వేలి జమ్ము): తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సుమారు 3,631 కిలోమీటర్ల దూరం వరకూ ఈ రైలు ప్రయాణం సాగించి జమ్ముకశ్మీర్‌లోని కట్రాకు చేరుకుంటుంది. మొత్తం 523 స్టేషన్లు కలిగిన ఈ మార్గంలో 62 స్టేషనల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.ఈ రైలు 71 గంటల 20 నిముషాల పాటు ప్రయాణం సాగిస్తుంది.
నవయుగ్ ఎక్స్‌ప్రెస్(మంగళూరు నుంచి జమ్ము) ఇది వారాంతపు రైలు. జమ్ము తావి నుంచి మంగళూరు సెంట్రల్ వరకూ నడుస్తుంది. ఈ రైలు 3607 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 61 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు 68 గంటల పాటు తన ప్రయాణాన్ని సాగించి, గమ్యాన్ని చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment