ముంబై : భారతదేశంలో రైళ్లు తిరగడం 1853లో మొదలైంది. తొలి ప్యాసింజర్ రైలు ఆ ఏడాది ఏప్రిల్ 16న ముంబై – థానే మధ్య నడిచింది. 14 బోగీలు, 400 మంది ప్రయాణీకులు, మూడు ఇంజన్లు, 34 కి.మీ దూరం, 21 నిముషాల ప్రయాణం.. ఇవీ తొలి విశేషాలు. ఆనాటి నుంచి మన రైళ్లు నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా 167 ఏళ్ల తర్వాత తొలిసారి ప్యాసింజర్ రైళ్లు తిరగడం పూర్తిగా ఆగిపోయింది. ‘‘నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఆగకుండా నడిచిన రైళ్లను తొలిసారి మీ భద్రత కోసం నిలిపివేశాం’’ అని రైల్వేశాఖ 16వ తేదీన ఉద్విగ్న సందర్భ భావావేశంతో ట్వీట్ చేసింది. ‘‘ఇంట్లోనే ఉండండి. దేశాన్ని విజేతను చెయ్యండి’’ అని కూడా ప్రజలను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment