బాధితులకు వైద్యం అందిస్తున్న మొబైల్ అంబులెన్స్
మందస : మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు శుక్రవారం అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడికి దిగాయి. నర్సింగపు రం పంచాయతీ సమీపంలోని దేవుపురం దామోదరసాగరం రిజ ర్వాయర్ జీడితోటల్లో ఏనుగులు ఉండడంతో డిప్యూటీ రేంజ్ అధికారి పి.వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లా రు. వీరిని చూసిన ఏనుగులు ఒక్కసారిగా ఘీంకరించి, బుసకొడు తూ దాడికి దిగాయి. ప్రాణరక్షణకై సిబ్బంది పరుగులు తీశారు.
ఏనుగులు వెంబడించడంతో పరుగులు తీయలేక జారి పడిపోయారు. దీంతో డిప్యూటీ రేంజ్ అధికారికి చేతులు, తలపై స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా ఏబీఓ జీవీ కృష్ణారావు, ఎలిఫేంట్ ట్రాకర్స్ బాడ గణపతి, రామచంద్రరావు, ధనుంజయకు గాయాలయ్యాయి. బాధితులకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో ద్విచక్రవాహనం అంబులెన్స్ ద్వారా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment