సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని లింగాపురం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు స్థానిక ఇళ్లపై దాడి చేశాయి. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లో దిగి పంటలను నాశనం చేశాయి.
అయితే గత కొన్నేళ్లుగా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయని, చేతికందిన పంటలను నాశనం చేస్తున్నాయిని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారమిచ్చినా తాత్కాలిక పరిష్కారంతో సరిపెడుతున్నారని మండిపడుతున్నారు. ఏగుగుల దాడితో ప్రాణనష్టం జరుగుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment