
ఏనుగులు తోసేసిన పురిపాక
సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో నాలుగు ఏనుగుల గుంపు శుక్రవారం బీభత్సం సృష్టించింది. చిన్నగోరపాడు కొండల్లో పూరిపాకను నాశనం చేసింది. సవర సూరయ్య జీడితోట కాపలాకు వేసుకున్నాడు. ఇందులో ఉన్న కొండ చీపుర్లు కట్టలను చిందరవందర చేశాయి. కొన్ని జీడిచెట్లను కూడా నాశనం చేయడంతో బాధితుడు విలపిస్తున్నాడు. ఎఫ్‌ఎస్‌వో తిరుపతిరావు, బీట్ ఆఫీసర్ కె.దాలినాయుడు, ఏనుగుల ట్రాకర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులు ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు.