
సాక్షి,మన్యం: పార్వతీపురంలో గజ రాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మండలం నర్సి పురం సమీపంలో ఏనుగుల గుంపు కొబ్బరి తోటల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను లాగి విసిరేశాయి. పంటపొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల బీభత్సాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన వాహనాల్ని పక్కకు నెట్టాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపుతో స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment