hut
-
ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు
ఓ చిన్న రేకుల షెడ్‌కి అది కూడా రెండు ఎల్ఈడీ బల్బులకు ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చోసుకుంది. కర్ణాకలోని దారిద్య రేఖకు దిగువునన ఉన్న ప్రజలకు విద్యుత్్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం భాగ్యజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిచింది. ఆ పథకం కిందే కరెంట్ పొందింది 90 ఏళ్ల వృద్ధురాలు. ఐతే ఆమెకు ఉన్న చిన్న రేకుల షెడ్డులాంటి ఇంటిలో రెండు ఎల్ఈడీ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. వాటికి నెలకు మహా అయితే రూ. 70 లేదా రూ. 80ల కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఆమెకు మే నెలలో మాములుగా రాలేదు కరెంట్ బిల్లు. దాన్ని చూసి ఆ వద్ధురాలికి కళ్లు తిరిగినంత పనయ్యింది. వందో వెయ్యో కాదు ఏకంగా రూ. 1,03,315 బిల్లు వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ విషయం తెలుసుక్నున విద్యుత్ శాఖ అధికారులు ఆ వృద్ధురాలి ఇంటికి చేరకుని విచారించారు. మీటర్లో లోపం ఉందని, రీడింగ్ తీసిన వ్యక్తి కూడా తప్పుగా చూసినట్లు తేలింది. అంతేగాదు అధికారులు ఆమెను ఆ బిల్లును చెల్లించవద్దని, తాము దీన్ని సరిచేస్తామని ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
షరియత్ స్థాపనే హెచ్‌యూటీ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టి షరియత్ స్థాపనే లక్ష్యంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఈ సంస్థకు చెందిన 16 మంది ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెల్లో హైదరాబాద్, భోపాల్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఎన్ఐఏ ఈ కేసును గత నెల 24న రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది. ఇస్లామిక్ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉన్న ఓ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకోవడంతోపాటు ప్రార్థన స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశంలో దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాంతాల వారీగా తన్జీమ్లు ఏర్పాటు దేశంలో ఉన్న ప్రభుత్వం ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి హక్కుల కోసం పోరాడే సంస్థలపై నిషేధం విధిస్తూ, కార్యకర్తలను జైళ్లకు పంపుతోందని తమ కేడర్‌కు నూరిపోస్తోంది. దీనికి సంబంధించి ఆడియోలు, వీడియోలను రూపొందించి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ ద్వారా ప్రచారం చేసింది. ఈ ఉగ్ర సంస్థ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌ల్లో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా తన్జీమ్గా పిలిచే మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. మధ్యప్రదేశ్ తన్జీమ్‌కు యాసిర్ ఖాన్, తెలంగాణ తన్జీమ్‌కు మహ్మద్ సలీం నేతృత్వం వహించారు. వీళ్లు మరింత మందిని తన సంస్థలో చేర్చుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కుట్ర పన్నారు. ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోలతోపాటు ఐఎస్ఐఎస్ రూపొందించే ఆన్లైన్ పత్రిక వాయిస్ ఆఫ్ హింద్ ప్రతులు, ఖలాఫతుల్లా అల్ మహదీపై ఉన్న పత్రాలు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, ఏకే 47, 303 రైఫిల్‌తోపాటు వివిధ పేలుడు పదార్థాల ఫొటోలు, వాటి డాక్యుమెంట్లను రిట్రీవ్ చేశారు. హైదరాబాద్‌లోనే కీలక నిర్ణయాలు మధ్యప్రదేశ్, తెలంగాణ తన్జీమ్లకు చెందిన 17 మంది ఉగ్రవాదులు గతేడాది హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గోల్కొండ ప్రాంతంలోని సలీం ఇంట్లో జరిగిన ఈ మీటింగ్‌లోనే భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు తేల్చారు. సలీం సహా హైదరాబాద్ తన్జీమ్‌కు చెందిన ఆరుగురూ ఆపరేషన్స్ చేయడానికి సిద్ధమవుతూ శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తన్జీమ్‌కు సంబంధించి జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. -
ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఇవేనా?
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది. ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది. వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
ఉగ్ర ముఠాపై పంజా!
వారు మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు.. అందరి మధ్య ఉంటూనే అవసరమైనప్పుడు దాడి చేసి, కలకలం సృష్టించి.. మళ్లీ ఏమీ తెలియనట్టు ఉండిపోయేలా ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారు.. ఇంకా అవసరమైతే బాంబులతో విధ్వంసానికీ వెనకాడనివారు.. హైదరాబాద్‌లో దాడులకు సిద్ధమై చాప కింద నీరులా ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా విభాగం కలసి ఈ కుట్రను భగ్నం చేశాయి. సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోనూ ఏటీఎస్ అధికారులు మరో 11 మంది హెచ్‌యూటీ సంస్థ సభ్యులను అరెస్టు చేశారు. వారందరినీ అక్కడి కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 19వ తేదీ వరకు వారిని ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుబంధంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, ఉగ్రవాదులకు సానుభూతిపరులను తయారుచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్న ఈ సంస్థ.. భారత్ సహా 50కిపైగా దేశాల్లో ఉనికిలో ఉంది. మన దేశంలో దీనిపై నిషేధం లేదు. కొంతకాలం నుంచి హెచ్‌యూటీ సంస్థ ఎక్కడికక్కడ మాడ్యూల్స్‌ను తయారు చేసుకుంటూ విస్తరిస్తోంది. తమకు ఆకర్షితులైన వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆర్మ్డ్ వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియాలో గ్రూపులనూ నిర్వహిస్తోంది. కేడర్‌కు ప్రమాదకర ఆయుధాల వినియోగంతోపాటు రసాయన, జీవాయుధాల (కెమికల్, బయోలాజికల్) దాడులు చేసేలా.. వీటికి సంబంధించి ఎవరికి వారు మెటీరియల్ సిద్ధం చేసుకునేలా తర్ఫీదు ఇస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మాడ్యూల్.. భోపాల్‌కు చెందిన యాసీర్ హెచ్‌యూటీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనతో కలసి చదువుకున్న సౌరభ్‌రాజ్ వైద్యను మతం మార్చుకుని, హెచ్‌యూటీలో చేరేలా ప్రోత్సహించాడు. మహ్మద్ సలీంగా పేరుమార్చుకున్న సౌరభ్.. 2019లో హైదరాబాద్‌లోని గోల్కొండ బాబాబజార్ మోతీ మహల్‌కు వలస వచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా ఉద్యోగంలో చేరాడు. మరోవైపు కొన్నేళ్ల కింద ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన దేవీప్రసాద్ పాండ కొన్నేళ్ల క్రితమే మతం మార్చుకుని అబ్దుర్ రెహ్మాన్గా మారాడు. గోల్కొండలోని ధన్కోక ప్రాంతంలో నివాసం ఉంటూ.. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ బస్క వేణుకుమార్ కూడా కొన్నేళ్ల క్రితం మతం మార్చుకుని మహ్మద్ అబ్బాస్ అలీగా మారాడు. సలీం ఈ ఇద్దరితోపాటు గోల్కొండ బడాబజార్‌కు చెందిన దంత వైద్యుడు షేక్ జునైద్, జగద్గిరిగుట్ట మగ్దూంనగర్‌కు చెందిన మహ్మద్ హమీద్, జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌లను ఆకర్షించాడు. తనతో సహా ఆరుగురితో హెచ్‌యూటీ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యాసీర్ నేతృత్వంలో 11 మంది మరో మాడ్యూల్ కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు నెలల పాటు నిఘా పెట్టి.. యాసీర్, సలీంల మాడ్యూల్స్ ఉగ్రవాద దాడులకు సిద్ధమవుతున్న విషయంపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులకు మూడు నెలల క్రితం జాతీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అప్పటి నుంచి తెలంగాణ నిఘా వర్గాల సాయంతో ఏటీఎస్ అధికారులు వీరిపై కన్నేసి ఉంచారు. అన్ని అంశాలను నిర్ధారించుకుని.. మంగళవారం తెల్లవారుజామున అటు భోపాల్‌లో, ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భోపాల్‌లో 11 మంది పట్టుబడగా.. హైదరాబాద్‌కు చెందిన మాడ్యూల్లో మహ్మద్ సల్మాన్ మినహా ఐదుగురిని పట్టుకున్నారు. మహ్మద్ సలీం ఇంటి నుంచి రెండు ఎయిర్గన్లు, పిల్లెట్స్, కత్తులు, గొడ్డళ్లతోపాటు ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిని పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్ సల్మాన్ కోసం రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. నిషేధం విధించేలా.. హెచ్‌యూటీ సంస్థపై 2021లో తమిళనాడులో ఓ కేసు నమోదైంది. దాన్ని దర్యాప్తు చేసిన ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)’గతేడాది అభియోగపత్రాలు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు వెల్లడించారు. అనంతగిరి అడవుల్లో క్యాంప్.. హైదరాబాద్‌లో రెక్కీ.. యాసీర్, సలీంల నేతృత్వంలోని 17 మంది ప్రత్యేకంగా రాకెట్ చాట్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తుపాకులు, కత్తులు, గొడ్డళ్లను వినియోగించి ఎవరికి వారుగా ‘లోన్ వూల్ఫ్ ఎటాక్స్ (ఒంటరిగానే ఎవరిపైనైనా దాడిచేసి కలకలం రేపడం)’చేయాలని.. అవసరమైనప్పుడు బాంబులు తయారు చేసి జనసమ్మర్థ ప్రాంతాల్లో విరుచుకుపడాలన్నది వీరి పథకం. ఇందుకోసం అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలతో పోరాడిన ఐసిస్ మాడ్యుల్స్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. రెండు మాడ్యూల్స్‌కు చెందిన 17 మంది కొన్నినెలల కింద వికారాబాద్ అనంతగిరి అడవుల్లో క్యాంపు నిర్వహించారు. ఎవరిని టార్గెట్‌గా ఎంచుకోవాలి? ఏ విధంగా దాడులకు దిగాలనేది చర్చించుకున్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో రెక్కీ చేశారు. పలు కీలక ప్రాంతాల్లో డ్రోన్లతోనూ రెక్కీ చేసి.. దాడులకు సన్నాహాలు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపుల్లో ఉంటూ దాడులకు మెటీరియల్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఐసిస్ కన్నా ప్రమాదకరంగా హెచ్‌యూటీ! ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేస్తున్నట్టు ప్రచారమున్నా.. దాని మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1952లో ఇజ్రాయెల్‌లోని జేరుసలేంలో స్థాపితమైన ఈ సంస్థ.. ప్రస్తుతం లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. యూరప్‌తోపాటు ఆసియాలోని ముస్లిం ప్రభావిత దేశాలకు విస్తరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలో దీని ఉనికి ఎక్కువ. నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకపోవడంతో చాలా దేశాల్లో దీనిపై నిషేధమేదీ లేదు. అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ పతనం అనంతరం ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు హెచ్‌యూటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారుతోందని.. రసాయన, జీవాయుధాల వినియోగంపై కేడర్‌కు శిక్షణ ఇస్తోందని హెచ్చరించాయి. భారత్‌లో హెచ్‌యూటీ కార్యకలాపాల విస్తరణపై అంతర్జాతీయ భద్రతా సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిఘా పెట్టినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. -
నిద్రలోనే మహిళ సజీవ దహనం
సాక్షి,మెదక్ రూరల్: విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో మహిళ సజీవ దహనం కాగా తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పోలబోయిన నర్సింహులు, మంగమ్మ(35) దంపతులకు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు రవి ఉన్నాడు. ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికొచ్చి రోజూ మాదిరిగానే నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1 గంటకు నిద్రలో ఉండగా విద్యుత్ షాక్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమై తేరుకునే లోపే క్షణాల్లో పూరి గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న మంగమ్మ సజీవదహనం కాగా మృతురాలి భర్త నర్సింహులు, కుమారుడు రవికి 50 శాతానికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ ఎస్ఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని పంచనామా నిర్వహించారు. -
ఒక బల్బు, టేబుల్ ఫ్యాన్; ఇంత బిల్లు ఎలా కట్టేది?
భోపాల్: మీటర్లో సాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి కరెంట్బిల్లులు షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి చిత్రమైన అనుభవాలను ఇప్పటికే చాలాసార్లు చూశాం. వాటికి సంబంధించిన బిల్లులు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక నిరుపేద వృద్ధురాలికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక లైటు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల బిల్లు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన 65 ఏళ్ల రాంబాయి ప్రజాపతి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనిచేసుకుంటూ ఒక పూరి గుడిసెలో నివసిస్తుంది.ఆమెకు ఇంట్లో ఒక లైట్, టేబుల్ ఫ్యాన్ తప్ప మరే వస్తువు లేదు. ప్రతీనెల ఆమెకు రూ. 300 నుంచి రూ. 500కు మించి కరెంట్ బిల్లు వచ్చేది. కానీ గత నెలలో ఏకంగా రూ .2.5 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి షాకైంది. విద్యుత్ అధికారుల ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లింది. కానీ అక్కడ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎవరైనా అధికారి కలిస్తే తన గోడు వెల్లబోసుకోవచ్చని అప్పటినుంచి ప్రతిరోజు విద్యుత్ కార్యాలయం చుట్టు ప్రదర్శనలు చేస్తుంది. ఈ సందర్భంగా రాంబాయి ప్రజాపతి మాట్లాడుతూ.. '' నేను చాలా సంవత్సరాల నుంచి షాన్టీ ప్రాంతాలోని ఒక గుడిసెలో నివసిస్తున్నాను.ఇంత చిన్న పూరి గుడిసెలో నివసించే నాకు లక్షల్లో బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారును సంప్రదిస్తే వారు అస్సలు పట్టించుకోవడం లేదు. నా సమస్య పరిష్కారం కోసం కేవలం విద్యుత్ అధికారులనే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులను, గుణ కలెక్టర్ కూడా కలిశాను. కానీ ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు” అని వాపోయింది. -
వైరల్ పిక్: ట్రీ హట్
బికనేర్: పర్యావరణాన్ని కాపాడటం, ప్రకృతితో మమేకం అవడం అంటే కొందరికి ఎంతో ఇష్టం. దాని కోసం ఏం చేసేందుకైనా వారు వెనుకాడరు. వారి ప్రయత్నాలు ఇతరులను అబ్బుర పరుస్తాయి, ఆకట్టుకుంటాయి, స్ఫూర్తిని నింపుతాయి. రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి యువకుడు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్టుపైనే తన కోసం ప్రత్యేకంగా గదిని కట్టుకున్నాడు. రాజస్థాన్‌లో మండే ఎండల నుంచి ఈ చెట్టు గది ఎంతో ఉపశమనం అందిస్తోంది అంటున్నాడు. ఈ ట్రీ హట్‌కి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. -
పూరిపాక ధ్వంసం చేసిన ఏనుగులు
సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో నాలుగు ఏనుగుల గుంపు శుక్రవారం బీభత్సం సృష్టించింది. చిన్నగోరపాడు కొండల్లో పూరిపాకను నాశనం చేసింది. సవర సూరయ్య జీడితోట కాపలాకు వేసుకున్నాడు. ఇందులో ఉన్న కొండ చీపుర్లు కట్టలను చిందరవందర చేశాయి. కొన్ని జీడిచెట్లను కూడా నాశనం చేయడంతో బాధితుడు విలపిస్తున్నాడు. ఎఫ్ఎస్వో తిరుపతిరావు, బీట్ ఆఫీసర్ కె.దాలినాయుడు, ఏనుగుల ట్రాకర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులు ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. -
ఇళ్లపై ఏనుగుల దాడి
శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేట మండలం సంతవలస గ్రామంలోని పూరిళ్లపై నాలుగు ఏనుగులు మంగళవారం రాత్రి దాడి చేశాయి. వీటి దాడిలో ఏడు పూరిళ్లు దెబ్బతిన్నాయి. అలాగే, సమీపంలోని వరి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఏనుగుల దాడితో స్థానికులు బెంబేలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
-
గుడిసెల జోలికొస్తే రోడ్డుకీడుస్తాం
సాక్షి, హైదరాబాద్: గుడిసెల్లో ఉంటున్న పేదలకు పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలకు పాల్పడుతోందని వివిధ పక్షాలు నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల పరిధిలో గుడిసెల తొలగింపును వెంటనే నిలిపివేయాలని, అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో గుడిసెలను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ‘‘పేదల గుడిసెల తొలగింపు-టీఆర్ఎస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి’’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గుడిసెలు తొలగింపునకు గురైన కొమురంభీమ్‌నగర్ పేదలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని రోడ్డు మీదకు ఈడుస్తామని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. కబ్జాకు గురైన భూములను తాము చూపుతామని, వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే పేదలకు ఒకటి కాదు మూడు పడక గదులు కట్టించి ఇవ్వొచ్చునన్నారు. గుడిసెల తొలగింపునకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పోరాడుతామని, పేదల గుడిసెలను తొలగిస్తున్న ప్రభుత్వానికి మానవత్వం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు గుడిసెలు తొలగించడం కేసీఆర్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిదర్శనమన్నారు. గృహ నిర్మాణం కోసం రెండు బడ్జెట్లలో రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయించిన ప్రభుత్వం అందుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఒక్క గుడిసె జోలికి వచ్చినా సీఎం కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు పంపిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హెచ్చరించారు. ఒక్క గుడిసెను తొలగించినా ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. గుడిసె వాసుల కోసం వామపక్షాలు చేపట్టే పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కొమురంభీమ్ నగర్ గుడిసెవాసులతో పాటు రాష్ట్రంలోని గుడిసెవాసులందరికీ జీవో 59 ప్రకారం చట్టబద్ధంగా పట్టాలు పొందే హక్కు ఉందని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గృహకల్పలో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు వామపక్షాలు, ఇతరపార్టీలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఈ భేటీకి శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్ఎస్పీ), వీరయ్య ( సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. -
గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు
ఆదిలాబాద్: ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన ముసుగు పోసాని(70) అనే వృద్ధ మహిళ గుడిసె మంటల్లో ఇరుక్కొవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. విషయం తెలిసిన రెవిన్యూ అధికారి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వృద్ధ మహిళకు ఆర్థిక సాయం చేస్తామని హామినిచ్చారు. -
గుడిసెకు నిప్పంటుకొని.. వృద్ధుడు మృతి
-
తెనాలిలో ఏడు పూరిళ్లు దగ్ధం
తెనాలి అర్బన్ : పట్టణంలో మొన్నటి ఘోర అగ్నిప్రమాద సంఘటన మాసిపోకముందే సోమవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. పేదల గుడిసెలపై ఉగ్రరూపం దాల్చిన అగ్నికీలలకు క్షణాల్లో ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. స్థానిక మారీసుపేట మఠంబజారులో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు అనుకుని ఉన్న పూరిళ్లలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పాక నుంచి ఎగసిపడిన మంటలు క్షణాల్లో అలముకున్నాయి. చూస్తుండగానే ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. ఆకస్మిక పరిణామంతో ప్రజలు భీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కితే చాలన్నట్లు పరుగులు పెట్టారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సమీపంలోని అపార్ట్మెంట్, భవనాల్లో ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు. స్పందించిన అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి కె.కృష్ణారెడ్డి నేతృత్వంలో బృందం రెండు వాహనాలతో అక్కడికి చేరుకుంది. చుట్టుపక్కల భవనాలకు ప్రమాదం లేకుండా మంటలను అదుపు చేసింది. ఆస్తినష్టం రూ.1.50 లక్షలు ఉంటుందని అధికారిక అంచనా. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కూలిపనులు చేసుకునే బాధితులు స్థానికంగా ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కేవీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.గోపినాథ్, ఎంఈ ఎం.ప్రభాకరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అనూరాధ, ఆర్ఐ సూర్యనారాయణమూర్తి, వీఆర్వోలు రోశయ్య, జగన్మోహన్రావు, ముఖర్జీ, సాయి తదితరులు పరిశీలించి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
పెళ్లికూతురి ఇల్లు దగ్ధం
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : మరికొన్ని గంటల్లో వివాహం జరుగనుందన్న ఆనందాన్ని అగ్నిదేవుడు ఆవిరి చేశాడు. వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేశాడు. గ్యాస్ లీకై ఇల్లు దగ్ధంకావడంతోపాటు పెళ్లి కోసం దాచిన నగదు, ఆభరణాలు, కొత్త దుస్తులు సైతం బుగ్గిపాలవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తెనాలి మండలం ఐతానగర్ శివారు యడ్లపాటి వెంకట్రావునగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇవీ... యడ్లపాటి వెంకట్రావునగర్‌లో నివసించే రిక్షా కార్మికుడు గుంజే ప్రసాద్, పోలేరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇరువురికి గతంలోనే వివాహం చేశారు. మూడో కుమార్తె పద్మావతికి అదే ప్రాంతానికి చెందిన తన్నీరు గోపితో బుధవారం రాత్రి వైకుంఠపురంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. బుధవారం మధ్యాహ్నం పెళ్లికూతురికి నలుగుపెడుతున్న సమయంలో వీరి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ పేలుతుందనే భయంతో అందరూ ఆర్తనాదాలు చేయటం మినహా ఇంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. ఇల్లు, ఇంట్లోని సామగ్రితోపాటు పెళ్లికోసం దాచి ఉంచిన నగదు రూ.70వేలు, పెళ్ళికొడుకు కోసం చేయించిన బంగారు గొలుసు, పెళ్లికూతురికి చేయించిన బంగారు బుట్టలు, పెళ్లి దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదే ఇంటికి అనుకుని ఉన్న మరో పూరిల్లు కూడా బూడిదైంది. క్షణాల్లో జరిగిన పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి మంటలను అదుపుచేశారు. మొత్తమ్మీద ప్రాణాపాయం లేకపోవటంతో స్థానికులు కొంత మేరకు ఊపిరిపీల్చుకున్నారు. చింతాయపాలెంలో మరో పూరిల్లు.. చింతాయపాలెం(కర్లపాలెం): పూరిల్లు దగ్ధమై రూ.లక్ష ఆస్తినష్టం జరిగిన సంఘటన బుధవారం చింతాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చింతాయపాలెం పంచాయతీ తూర్పుపాలెం గ్రామానికి చెందిన ఏనుగు శేషయ్య, శివకుమారి దంపతులు బుధవారం పొలం పనికి వెళ్లారు. ఉదయం 10గంటల సమయంలో ఇంటిపైకప్పునకు మంటలంటుకున్నాయి. గృహంలోని వస్తువులు, రెండు శవర్ల బంగారం దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి కారణం తెలియలేదు.