తొండంతో కొట్టి చంపింది | Elephant Tramples Man Who Tried To Take Its Photo On Bengal Highway | Sakshi
Sakshi News home page

తొండంతో కొట్టి చంపింది

Published Fri, Nov 24 2017 2:01 PM | Last Updated on Fri, Nov 24 2017 2:38 PM

Elephant Tramples Man Who Tried To Take Its Photo On Bengal Highway - Sakshi - Sakshi

కోల్‌కతా : సెల్ఫీ దిగాలని యత్నించిన వ్యక్తిని ఏనుగు తొండంతో కొట్టి చంపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న అతనికి అటవీ ప్రాంతంలోని హైవేపై ఏనుగు వెళ్లడం కనిపించింది. 

ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన సాదిఖ్‌.. దాని దగ్గరకు వెళ్లాడు. మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. ఏనుగు తొండంతో దాడి చేసింది. దాంతో సాదిఖ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు సాదిఖ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement