ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి | Viral: Angry Elephant Comes Towards Man And His Reaction Teaches Lesson | Sakshi
Sakshi News home page

అమ్మో.. కోపంతో ఏనుగు ఎలా వచ్చిందో చూడండి

Published Fri, Aug 21 2020 7:41 PM | Last Updated on Fri, Aug 21 2020 10:06 PM

Viral: Angry Elephant Comes Towards Man And His Reaction Teaches Lesson - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భయానక దృశ్యం. సాధారణంగా అడవిలో గజరాజు కనిపిస్తే చాలు గుండె ఆగినంత పనౌవుతుంది. ఇంకా అది కొపంతో మన మీదకు వస్తే ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఊహించుకుంటునే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. కానీ అతడు ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో అటవీ శాఖ అధికారి సుశాంత్‌ నందా శుక్రవారం షేర్‌ చేశారు. దీనికి ‘ఈ వ్యక్తికి మరో జీవితం అంటూ’ నందా ట్వీటర్‌లో పంచుకున్నారు.
(చదవండి: వైరల్‌: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ)

40 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పొదల చాటున ఉన్న ఆ వ్యక్తిని చూసిన ఏనుగు అతడి మీదకు కోపంగా వస్తుంది. అదలా రావడం చూసిన అతడు దానిపైకి కర్ర ఎత్తాడు. దీంతో అది కాస్తా ఆగి.. మరింత కోపం తెచ్చుకుని అతడి మీదకు దూసుకురావడంతో మరింత అప్రమత్తయ్యాడు. పైకి లేచి కర్రను మరింత పైకి లేపి దానిని బెదిరించాడు. దీంతో అది తోకముడిచి ఏనుగు వెనక్కి వెళ్లిన వీడియోను షేర్‌ చేసిన గంటల వ్యవధిలోనే సుమారు 13.5 లక్షల వ్యూస్, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ఇది నిజంగా భయంకరంగా ఉంది’, ‘అతడు చాలా అదృష్టవంతుడు’, ‘అతడు సమయస్పూర్తితో వ్యవహరించాడు’, ‘నిజంగా అతడికి ఇది మరో జీవితం’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement