ఏనుగు బీభత్సం.. యువకుడి మృతి | Elephant tramples teen to death, friend critically injured | Sakshi
Sakshi News home page

ఏనుగు బీభత్సం.. యువకుడి మృతి

Published Sat, Apr 16 2016 2:51 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

ఏనుగు బీభత్సం.. యువకుడి మృతి - Sakshi

ఏనుగు బీభత్సం.. యువకుడి మృతి

ప్రముఖ పర్యాటక స్థలమైన ఊటీ సమీపంలోని చెరంపాడిలో ఓ ఏనుగు విజృంభించింది. 19 ఏళ్ల యువకుడిని తొక్కి చంపేసింది. బాధితుడి స్నేహితుడు కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షఫీ, షాను అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం రాత్రి సరుకులు కొనుక్కుని తిరిగి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి రూమ్‌కు వెళ్తుండగా ఉన్నట్టుండి వెనకల దట్టమైన పొదల్లోంచి వచ్చిన ఏనుగు వారిపై దాడిచేసింది. సమీపంలోని బస్టాండులో ఉన్న ప్రజలు వాళ్ల అరుపులు విని అక్కడకు వచ్చేసరికి అప్పటికే ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.

వాళ్లను వెంటనే కోజికోడ్‌లోని వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ షఫీ గాయాలతో మరణించాడు. షానును వైతిరి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అటవీశాఖ అధికారులు ఈ ఏనుగుల బారి నుంచి తమను కాపాడాలని, అవి పదేపదే మనుషుల మీద దాడులు చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ దుకాణదారులు బంద్ నిర్వహించారు. గత 15 రోజులలో ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement