Viral Video:Hungry Elephant Breaks Into Kitchen In Thailand Looking For Something To Eat - Sakshi
Sakshi News home page

Thailand Elephant: అసలే ఆకలి! ఆపై కమ్మని వాసన, తట్టుకోలేక..

Published Tue, Jun 22 2021 9:34 AM | Last Updated on Tue, Jun 22 2021 1:53 PM

Thailand Elephant Attack In Kitchen Video Viral  - Sakshi

ఏనుగులు మనుషులపై దాడులు చేయడం తరచూ చూస్తుంటాం. మావటి వాళ్లకు, మచ్చిక చేసుకునే వాళ్లకు తప్ప ఎవరీకి అవి లొంగవు. అలాంటిది ఓ అడవి ఏనుగు.. థాయ్​లాండ్​లో వింతగా ప్రవర్తిస్తోంది. వాసన పసిగట్టి.. ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి.. వంట గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
 
థాయ్​లాండ్​లో చలెర్మ్​కియాపట్టణా గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్.. వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్​ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్​ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు.. తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది. ఈ క్రమంలో వస్తవుల్ని నాశనం చేసిందిక ఊడా. ఆ నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. 


కాగా, బూన్​చుయే అనే ఆ మగ ఏనుగు.. ​ఇలా వ్యవహరించడం కొత్తేం కాదు. కయెంగ్​ క్రాచన్ నేషనల్​ పార్క్​లో ఉండే ఈ ఏనుగు.. తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్​గా ప్రవర్తించలేదని పార్క్​ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్​గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు.  

చదవండి: రాక్షసుల కన్నా దారుణంగా వ్యవహరించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement