వైరల్: వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. ఒక తీరని సమస్య. జరిమానాలు, కఠిన చర్యలు కూడా కొందరిని కట్టడి చేయలేని పరిస్థితి. అదే టైంలో.. కొన్ని కొన్నిసార్లు అధికారుల తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంటుంది. అయితే.. అవగాహనలో ఈ మధ్యకాలంలో కొన్ని డిపార్ట్‌మెంట్‌లు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోతే.. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంటుంది అంటూ ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ(ఈస్ట్ డివిజన్) కళా కృష్ణస్వామి. ఈ మేరకు ట్విటర్‌లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్ని పక్కన పడేసింది ఓ ఏనుగు. ఆ సమయంలో పక్కనే రోడ్డుకు కింది భాగంలో మరో రెండు బైకులు ఉన్నా.. ఆ ఏనుగు వాటి జోలికి పోలేదు.
దీంతో.. నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని, అలా పార్క్ చేయొద్దంటూ సదరు ఐపీఎస్ అధికారిణి ట్వీట్ చేశారు. ఆ అధికారిణి టైంకి లైకులు, షేర్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆ ఏనుగు వీడియో కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కేరళ మలప్పురంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. కాసేపు ప్రజలకు పరుగులు పెట్టించింది. ఆ సమయంలోనే జనాలను బెదరగొట్టి.. అలా బైక్‌ను లాగి తన్నింది. చివరకు.. గ్రామస్తులు దానిని ఎలాగోలా అడవిలోకి తరిమేసినట్లు తెలుస్తోంది.
" Don't park on main road " pic.twitter.com/Z8OYGBZmDR
— Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023
Comments
Please login to add a commentAdd a comment