no parking
-
Hyderabad: నో పార్కింగ్.. అయితే ఏంటి?
బంజారాహిల్స్: ప్రజావసరాలు, ప్రజాప్రతినిధుల కోసం, వారికి ఎస్కార్టుగా ఉండటం కోసం కేటాయించిన వాహనాలను కొంత మంది సిబ్బంది వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఎస్కార్ట్ వాహనంలో డ్రైవర్, గన్మెన్లు నిత్యం వాకింగ్‌కు వస్తున్నారు. పార్కు వద్ద నో పార్కింగ్జోన్లో నిత్యం వాహనాన్ని నిలుపుతున్నారు. ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేయవద్దని వాకర్లు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రిగారి వాహనం ఇది అంటూ దబాయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సైతం ప్రశ్నించడంతో వారిని సైతం మీ ఉద్యోగాలు ఉండాలా పోవాలా అంటూ బెదిరించినట్లు సమాచారం. -
వైరల్ వీడియో: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
-
Viral: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇదే గతి!
వైరల్: వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. ఒక తీరని సమస్య. జరిమానాలు, కఠిన చర్యలు కూడా కొందరిని కట్టడి చేయలేని పరిస్థితి. అదే టైంలో.. కొన్ని కొన్నిసార్లు అధికారుల తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంటుంది. అయితే.. అవగాహనలో ఈ మధ్యకాలంలో కొన్ని డిపార్ట్మెంట్లు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోతే.. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంటుంది అంటూ ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ(ఈస్ట్ డివిజన్) కళా కృష్ణస్వామి. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్ని పక్కన పడేసింది ఓ ఏనుగు. ఆ సమయంలో పక్కనే రోడ్డుకు కింది భాగంలో మరో రెండు బైకులు ఉన్నా.. ఆ ఏనుగు వాటి జోలికి పోలేదు. దీంతో.. నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని, అలా పార్క్ చేయొద్దంటూ సదరు ఐపీఎస్ అధికారిణి ట్వీట్ చేశారు. ఆ అధికారిణి టైంకి లైకులు, షేర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ ఏనుగు వీడియో కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కేరళ మలప్పురంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. కాసేపు ప్రజలకు పరుగులు పెట్టించింది. ఆ సమయంలోనే జనాలను బెదరగొట్టి.. అలా బైక్‌ను లాగి తన్నింది. చివరకు.. గ్రామస్తులు దానిని ఎలాగోలా అడవిలోకి తరిమేసినట్లు తెలుస్తోంది. " Don't park on main road " pic.twitter.com/Z8OYGBZmDR — Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023 -
నో పార్కింగ్.. నో కార్.. పోలీస్ కమిషనర్ ట్వీట్‌తో కలకలం
ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే చేసిన ట్వీట్ ఒకటి వాహనదారుల్లో కలకలం సృష్టించింది. అనేకానేక చర్చలకు దారి తీసింది. ముంబై రహదారులపై విపరీతంగా పెరుగుతున్న వాహనాల నేపథ్యంలో, ‘పార్కింగ్ స్థలం లేని వ్యక్తులకు కార్లను అమ్మకూడదు.. అంటే నో పార్కింగ్, నో కార్ పద్ధతిని ముంబైలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..?’ అని సంజయ్ పాండే ట్వీట్ చేశారు. ముంబైలో ప్రతి రోజూ 600 కొత్త కార్లు నమోదవుతున్నాయనీ, వీటితో పాటు అసంఖ్యాక ట్యాక్సీలు, ఇతర వాహనాలు ఉన్నాయనీ, వీటన్నింటి వల్ల నగరంలో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడుతోందని, అందుకే ఏదో ఒక ఉపాయం చేయాల్సి ఉంటుందనీ, నో పార్కింగ్, నో కార్ పద్దతిని అమలుచేస్తే ఎలా ఉంటుందోనని యోచిస్తున్నామనీ ఆయన అన్నారు. కాగా, పోలీస్ కమిషనర్ చేసిన ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ముంబైలో దాదాపు 80 శాతం ప్రజలు చాల్స్‌లో, మురికివాడల్లో నివాసముంటున్నారనీ, వారికి పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి వస్తుందనీ, సుమారు 40 శాతం వాహనాలు రోడ్ల పైనే పార్కింగ్ చేస్తారనీ, ప్రభుత్వమే చవక ధరల్లో పార్కింగ్ స్థలాలని పే అండ్ పార్క్ పద్ధతిలో ఏర్పాటు చేయాలనీ, అందుకోసం ప్రతి ప్రాంతంలో పార్కింగ్ భవనాల నిర్మాణం కొనసాగించాలనీ పలువురు సూచించారు. ప్రత్యామ్నాయమార్గం చూడాలి.. మొబిలిటీ ఫోరంకు చెందిన అశోక్ దాతార్ మాట్లాడుతూ, ముంబైలో నో పార్కింగ్ నో కార్ పద్ధతి అమలు చేయడం అసాధ్యమనీ, వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ అన్నారు. నిజానికి నో పార్కింగ్ నో కార్ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. పార్కింగ్ సమస్య ఎంత పాతదో ఈ ప్రతిపాదన కూడా అంతే పాతది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన సర్కారీ ఫైళ్ళల్లో మగ్గుతోంది. కాగా, గత పది సంవత్సరాల్లో ముంబైలో 107 శాతం వాహనాల సంఖ్య పెరిగిందనీ, ఈ సంఖ్య భస్మాసుర హస్తంగా మారక ముందే ఏదో ఒకటి చేయాలనీ, పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే అభిప్రాయపడ్డారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమనీ, నేను కూడా ఒక ముంబైకర్‌నే అని, నేను రోడ్‌పై సౌకర్యవంతంగా కారు నడిపించాలని కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఒక కిలోమీటర్ పరిధిలో 2,100 వాహనాలున్నాయి. గత పది సంవత్సరాల్లో 107 శాతం వాహనాలు పెరిగాయి. కార్ల సంఖ్య 92 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 121 శాతం పెరిగాయి. వాహనాల రద్దీని అరికట్టేందుకు గతంలో కూడా పలు సూచనలు వచ్చాయి. అందులో 1. నో పార్కింగ్ నో కార్ పద్ధతి 2. రెండవ కారుపై అధికంగా రోడ్ ట్యాక్స్ విధించడం, 3. కారు యజమానులపై అధికంగా ఇంధన ట్యాక్స్ విధించడం, 4. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ రేట్లను బాగా పెంచడం. కానీ ఈ సూచనలేవీ ఇంతవరకు అమలులోకి రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. -
టీజర్: సుశాంత్‌కు ప్రభాస్ విషెస్
తన లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్ చెబుతున్నాడు. డి.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక చూస్కోండి అంటూ టీజర్‌ను వదిలాడు. ఈ సినిమా బైక్ పార్కింగ్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. -
ఇక నుంచి నో పార్కింగ్ జరిమానా రూ.5 వేలు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపిన వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే నోపార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీశాఖ సిబ్బంది నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి పట్ల పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని కలెక్టర్ సూచించారు. అసాంఘిక శక్తులకు నిలయంగా ఉన్న అడ్డాలను గుర్తించి పోలీసు వ్యవస్థను పటిష్టపరచాలన్నారు. పోలీసు పెట్రోలింగ్ కూడా నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఖాళీ స్థలాల వద్ద మద్యం తాగకుండా ఉండేలా ఎక్సైజ్‌శాఖ నిఘా పెట్టాలన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు స్వీయరక్షణపై ఉపాధ్యాయులు, ఇళ్లల్లో తల్లిదండ్రులు బోధన చేయాలన్నారు. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దిశ’ తహసీల్దార్ విజయారెడ్డి, అటెండర్ చంద్రయ్య ఘటనలను ప్రస్తావిస్తూ, వారికి నివాళులర్పించారు. ప్రతి మహిళ స్వీయరక్షణ, ఆత్మస్థయిర్యం పెంపొందించుకోవాలన్నారు. గృహహింస, పనిచేసేచోట, లైంగిక, వరకట్నం వేధింపుల నుంచి రక్షణ పొందటానికి మహిళలు 181 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం 1098 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు. నాటిన ప్రతి మొక్కనుబతికించాలి హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. చనిపోయిన మొక్క స్థానంలో మరో మొక్కను నాటాలన్నారు. మొక్కలు నాటటం, వాటిని కాపాడటం ఒక దైవంగా భావించాలన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ప్రతి మొక్కను బతికించాలన్నారు. శానిటేషన్, పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పనులు చేపట్టాలన్నారు. విద్యుదాఘాతంతో మరణించిన పశువులకు నష్టపరిహారాన్ని సంబంధిత రైతులకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ విద్యాసాగర్, డీఆర్ఓ మధుకర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టు అధికారుల దురుసు ప్రవర్తన
గన్నవరం: రాంగ్ పార్కింగ్ చేశాడని ఓ వాహనదారుడిపై ఎయిర్‌పోర్టు అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన వివాదస్పదమైంది. వివరాలీలా వున్నాయి. గుంటూరుకు చెందిన జీహెచ్. రావు హైదరాబాద్ నుంచి విమానంలో వస్తున్న బందువును తీసుకువెళ్ళేందుకు కారుతో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. టెర్మినల్ భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాన్ని నిలిపి బందువును రిసీవ్ చేసుకుని కారు వద్దకు వచ్చారు. ఇంతలో కారు ముందు టైరును లాక్‌చేసి ఉండడం చూసి అవాక్కయ్యాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడుగుగా రాంగ్ పార్కింగ్‌లో పెట్టినందుకు టెర్మినల్ బాధ్యతలు చూస్తున్న అధికారి యశ్వంత్ లాక్‌చేసినట్లుగా చెప్పారు. దీనితో జీహెచ్. రావు సదరు యశ్వంత్‌ను కలువగా రూ. 3 వేలు జరిమానా కట్టి కారును తీసుకువెళ్ళాలని చెప్పాడు. ఇదేమని ప్రశ్నించిన ఆతనిపై యశ్వంత్ దురుసుగా ప్రవర్తించడంతో వీరి మధ్య మాట మాట పెరిగి వాగ్వావాదానికి దారితీసింది. జరిమానా కట్టిన తర్వాతే కారు విడుదల చేస్తామని చెప్పడంతో చేసేది లేక డబ్బులు కట్టి కారును తీసుకువెళ్ళారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, తోటి వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అధికారులు దురుసు ప్రవర్తనతో ఎయిర్‌పోర్టుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారంటూ మండిపడుతున్నారు. రాంగ్ పార్కింగ్‌లో వాహనాలు నిలపవద్దని చెప్పాల్సిందిపోయి వేల రూపాయిలు జరిమానా రూపంలో వసూలు చేయడం దారుణమని పేర్కొంటున్నారు. -
రైల్వే స్టేషన్లో జరిమానాల దందా.!
విజయవాడ రైల్వే స్టేషన్లో జరిమానాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెట్టిన వారి నుంచి అక్కడి ప్రీమియం స్టాండ్ కాంట్రాక్టర్ ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ ఫైన్‌కు ఒక లెక్కా పత్రం ఉండదు.. రశీదు ఇవ్వరు.. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఇదే విధంగా కాంట్రాక్టర్‌కు, వాహనయజమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టర్, పోర్టర్ల హవా నడుస్తోంది. సౌత్ టెర్మినల్‌కు సమీపంలోని ఫ్లాట్‌ఫారాలపైకి పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక గేటు ఉంది. ఈ గేటులోంచి ఫ్లాట్‌ఫారాలపై వెళ్లడం సులభంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ గేటులోంచి లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కేవలం ట్రాలీలతో పార్సిళ్లు, సరుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే ఈ గేటు ఉందని, ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదంటూ పోర్టర్లు అడ్డుకుంటున్నారు. నో పార్కింగ్ జోన్.. ఈ గేటు ప్రక్కనే ఒక టూ వీలర్ ప్రీమియం స్టాండ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాన్ని పార్క్ చేస్తే గంటకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టెర్మినల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అధికారులు నో–పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. అయితే సౌత్ టెర్మినల్ వైపు తమ బంధువుల్ని రైలు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా నో పార్కింగ్ బోర్డును చూసుకోకుండా అక్కడ తమ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకు నగరం నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని రైళ్లు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా ఇక్కడే వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ ‘ప్రత్యేక జరిమానా’ వాస్తవంగా ఇక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.500 జరిమానా వేస్తామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని ఇక్కడి కాంట్రాక్టర్ అదునుగా చేసుకుని దందాకు తెరలేపారు. హడావుడిగా వచ్చి ఇక్కడ వాహనం పార్కింగ్ చేయగానే వాహనాలన్నింటిని కలిపి చైన్ వేస్తున్నారు. చైన్ తీయడానికి ఒక్కొక్క వాహనానికి రూ.100 నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. ఈ వసూలుకు ఏ విధమైన రశీదు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే రూ.500 బోర్డు చూపించి అది ఇస్తే రశీదు ఇస్తామని చెబుతుండటం గమనార్హం. వాగ్వివాదం.. ఆదివారం ఉదయం తమ వాహనాలకు చైన్ వేయడంపై కొంతమంది వాహన యజమానులు కాంట్రాక్టర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని కచ్చితంగా చెప్పడంతో కొంతమంది గత్యంతరం లేక జరిమానా చెల్లించి వాహనాలను తీసుకున్నారు. రూ.150 చెల్లించా.. మా బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చా. రైలు వెళ్లిపోతుందేమోనన్న హడావుడిలో నో పార్కింగ్ బోర్డు చూసుకోకుండా స్కూటర్ పార్క్ చేసి వెళ్లాను. తిరిగి ఐదు నిమిషాల్లో వచ్చాను. అయినా నా వద్ద రూ.150 వసూలు చేశారు.– రామాంజనేయులు, వాహనదారుడు -
అక్కడ నో పార్కింగ్‌లో కారు పెట్టారో ?
-
నో పార్కింగ్.!
పుష్కరఘాట్లలో ప్రారంభంకాని పనులు పుష్కరాలకు మరో 13 రోజులే గడువు అనేక ఘాట్లకు వాహనాలు నిలిపేందుకు స్థలాలు గుర్తించని పరిస్థితి ప్రధాన ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల విస్తీర్ణం (ఎకరాల్లో) బీచుపల్లి 320 గొందిమళ్ల 100 పస్పులలో 40 పంచదేవులపాడు 30 సోమశిల 10 (వీఐపీ), 40(సాధారణ) నదీ అగ్రహారం 25 మొత్తం ఘాట్లు 52 కేటాయించిన నిధులు : రూ.11.50కోట్లు నిధులు మంజూరైనవి : 9 ఘాట్లకు మాత్రమే కేటాయించిన స్థలం : 50 నుంచి 300 ఎకరాల వరకు (ఒక్కోఘాట్కు రద్దీని బట్టి) బాధ్యత తీసుకున్నశాఖలు : ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ కృష్ణా పుష్కరాల ముహూర్తం దగ్గర పడుతోంది. పుష్కరఘాట్లకు జనం పోటెత్తనున్నారు. వారు వచ్చే వాహనాలను నిలుపుకునేందుకు ఏర్పాటుచేయాల్సిన పార్కింగ్ స్థలాల ఎంపిక నెమ్మదిగా సాగుతోంది. కొన్నిచోట్ల ఇప్పుడే పనులు ప్రారంభంకాగా, మరికొన్ని చోట్ల అయితే స్థలాల ఎంపికే పూర్తికాలేదు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కేవలం 9 ప్రధాన ఘాట్లకు మాత్రమే పార్కింగ్ స్థలాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. మరో 37 ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన వాటి మంజూరు మాత్రం ఇప్పటివరకు కాలేదు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ కృష్ణా పుష్కరాల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఇంకా నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పార్కింగ్ వంటి పనులు చివరి నిమిషం వరకు పూర్తవుతాయో లేదోనన్న సందేహం తలెత్తుతోంది. జిల్లాలో 52పుష్కరఘాట్లను ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల రద్దీ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించాలని సంకల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభానికి 15రోజుల ముందే అన్ని శాఖల పనులు పూర్తి కావాలని అధికారులు పదేపదే చెబుతున్నా పార్కింగ్ స్థలాల ఎంపిక, టెండర్ల ప్రక్రియను ఆర్అండ్బీ శాఖ కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. ఈ ప్రక్రియ గురువారం వరకు కొనసాగడంతో జిల్లాలో ఏ ప్రధాన పుష్కరఘాట్ వద్ద కాంట్రాక్టర్లు పార్కింగ్ స్థలాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయారు. ఇంకా కొన్ని పార్కింగ్ స్థలాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి, అగ్రిమెంట్ దశలో ఉండడంతో పుష్కరఘాట్ల వద్ద పార్కింగ్ నిర్మాణం ఊసే లేకుండాపోయింది. రద్దీని బట్టి స్థలాల ఎంపిక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఆయా పుష్కరఘాట్ల రద్దీని బట్టి 50ఎకరాల నుంచి 300ఎకరాల వరకు పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశాయి. స్థలాలను చదును చేయడం, రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి పనులు చేయాల్సి ఉన్నా, ఇంకా ఎక్కడా ఆ స్థాయిలో ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. పార్కింగ్ స్థలాల ఏర్పాటు కోసం ఆర్అండ్బీ శాఖ రూ.11.5కోట్లు వెచ్చించడానికి సిద్ధమై, పనులకు టెండర్లను పిలిచి ఖరారు చేసింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధానఘాట్లకు మాత్రమే పార్కింగ్ స్థలాలకు నిధులు మంజూరయ్యాయి. మరో 37ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా, వాటికి మంజూరు రాలేదు. రెండు ఘాట్లలో పనులు ప్రారంభం రాష్ట్రంలోనే ప్రధాన పుష్కరఘాట్ బీచుపల్లిలో 320ఎకరాల భూమిని పార్కింగ్ కోసం కేటాయించారు. ఇక్కడ పార్కింగ్ స్థలాలను ఏ, బీలుగా విభజించి టెండర్లను ఖరారు చేశారు. ఏ పార్కింగ్‌ను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు వీఎస్టీ కంపెనీ శుక్రవారం పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్న గొందిమళ్ల వీఐపీ ఘాట్ (జోగుళాంబ ఘాట్)లో పార్కింగ్ నిర్మాణ పనుల జాడే కనిపించడం లేదు. దాదాపు 100 ఎకరాల్లో ఇక్కడ వీఐపీ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, పనులు ప్రారంభం కాలేదు. గద్వాల నది అగ్రహారంలో 25 ఎకరాల్లో పార్కింగ్ పనులు శుక్రవారమే ప్రారంభమయ్యాయి. ఆత్మకూర్‌లోని జూరాల వద్ద గల పుష్కరఘాట్ సమీపంలోని పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మక్తల్ మండలం పస్పులలో 40ఎకరాలు, పంచదేవులపాడులో 30 ఎకరాల్లో పార్కింగ్స్థలాన్ని కేటాయించగా ఎక్కడా పనులు ఊసే లేదు. అలాగే సోమశిలలో వీఐపీల కోసం 10ఎకరాలు, సాధారణ భక్తుల కోసం 40ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని టెండర్లు ఖరారు చేసినా నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. పార్కింగ్ స్థలం మంజూరైన ప్రధాన ఘాట్లలోనే ఇలా ఉంటే.. ప్రతిపాదనలకే పరిమితమైన మిగిలిన ఘాట్ల పార్కింగ్ పరిస్థితి ఆయోమయంగా ఉంది. -
ఇదేం బాదుడు?
సాక్షి, సిటీబ్యూరో:మౌలిక వసతుల కల్పన మా విధి కాదంటున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆ బాధ్యత తనదే అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బల్దియా అధికారులు.. ఫలితంగా పార్కింగ్ వసతుల్లేకుండా నడుస్తున్న సముదాయాలు.. చివరకు జరిమానా చెల్లించి జేబుకు చిల్లుపెట్టుకునేది మాత్రం సామాన్యులు.. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సోమవారం నుంచి ‘భారీ బాదుడు’ షురూ చేశారు. సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌తో పాటు నో పార్కింగ్ ఉల్లంఘనలకు రూ.1000 చొప్పున వడ్డిస్తున్నారు. మిగిలిన మూడింటి విషయం అలా ఉంచితే ‘నో పార్కింగ్’ విషయంలో మాత్రం నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలకు సరైన పార్కింగ్ వసతులే లేనప్పుడు అక్కడకు వచ్చిన తాము వాహనాలను ఎక్కడ పార్క్ చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. వాణిజ్య సముదాయూలకు పార్కింగ్ స్థలం తప్పనిసరంటూ చేసేవన్నీ ఆర్భాటపు ప్రకటనలేనా? అని నిలదీస్తున్నారు. నగరంలోని అనేక వాణి జ్య సముదాయూలు, కేఫ్, దుకాణాలు సరైన పార్కింగ్ స్థలాలు లేకుండానే కొనసాగుతున్నా యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన పాపానికి వాహనదారులు ‘భారం’ మోయాల్సి వస్తోంది. జీవో ఉన్నా అమలు సున్నా... నగరంలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా నో-పార్కిం గ్‌లోనూ వాహనాలు నిలపడం అనివార్యమైం ది. ట్రాఫిక్ ఇబ్బందులకు ఇదీ ఓ ప్రధాన కారణమే. పలుచోట్ల వాణిజ్య సముదాయూలు, దుకాణాలకు సరైన పార్కింగ్ వసతుల్లేవు. వాటికి వచ్చిన వారంతా రోడ్లపైనే వాహనాలకు ఆపుతున్నారు. ఫలితంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నారుు. ఈ క్రమంలో ప్ర భుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బ న్ డెవలప్మెంట్ శాఖ ద్వారా 2006లో జీవో నెం. 86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయూలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా ఉంది. మల్టీప్లెక్స్‌తో కూడిన సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మొత్తం విస్తీర్ణంలో 60 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు 40 శాతం పార్కింగ్ స్థలం తప్పనిసరి. వాణిజ్య సముదాయాలు తదితరాలకు 25 శాతం ఉం డాలి. అలా లేని వాటికి లెసైన్స్ రెన్యువల్ చేయవద్దని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. రెన్యువల్స్ ఎలా సాధ్యం? వాణిజ్య సముదాయూలు, సినిమా హాళ్లు, కేఫ్‌ల యజమానులకు ఏటా జనవరి నుంచి డిసెంబరు వరకు పోలీసులు లెసైన్స్ జారీ చేస్తారు. వీటి రెన్యువల్ ప్రక్రియ నిరంతరాయం. ఆ సమయంలో శాంతి భద్రతల కోణం నుంచే కాక వీటివల్ల ఏవైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయూ? అనే కోణంలోనూ పరిశీలించాల్సి ఉంటుంది. జీవో ప్రకారం నిర్దేశించిన పార్కింగ్ స్థలం లేకుంటే లెసైన్స్ రెన్యువల్ నిలిపివేయూలి. అరుుతే నగరంలో ఉన్న వాణిజ్య సముదాయూలు, కేఫ్‌ల్లో దాదాపు 70 శాతం సరైన పార్కింగ్ స్థలాలు లేవు. వీటి లెసైన్సుల రెన్యువల్ చేసే సమయంలో పోలీసు శాఖ పట్టించుకోకపోవడమే దీనికి కారణం. కొన్నైతే ఏకంగా రెన్యువల్ చేరుుంచకుండానే కొనసాగుతున్నారుు. మరికొ న్ని సంస్థల యూజమాన్యాలైతే రెన్యువల్ కోసం కట్టిన చలాన్ రసీదునే లెసైన్స్‌గా పేర్కొంటూ నెట్టుకొచ్చేస్తున్నారు. వీటి విషయంలో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పుడు మాత్రం భారీ జరిమానాల పేరుతో బాదేయడాన్ని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. పార్కింగ్ వసతులు లేని సముదాయాలు, వాణిజ్య ప్రాంతాలకు రెన్యువల్ ఆపేస్తే... అక్కడకు తాము వెళ్లడం, నో పార్కింగ్‌లో వాహనం నిలపాల్సిన అవసరమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు. పట్టనట్లు వ్యవహరిస్తున్న ‘గ్రేటర్’... నిబంధనల ప్రకారం ఏదైనా స్థలం, సముదాయూనికి సంబంధించిన కొలతలు తీయూల్సిన బాధ్యత ఇంజనీరింగ్ విభాగానికి. ఇది జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉంటుంది. సముదాయం ఉన్న ప్రాంతం, వాటిలోని విభాగాలు, ఇతర ప్రాంతాలను కచ్చితంగా లెక్కకట్టడానికి అవసరమైన సాంకేతిక అర్హత, పరిజ్ఞానం వారికే ఉంటుంది. నగరంలో మాత్రం ఈ పార్కింగ్ ఏరియూను కొలిచే బాధ్యత ఏమాత్రం ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ఇది తమ పని కాదన్నట్లు ‘గ్రేటర్’ అధికారులు వ్యవహరిస్తున్నారు. లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ పరిశీలించడం, ఆ సముదాయూన్ని సందర్శించి కొలతలు తీసి సరిచూడటం వీరి పనే. ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా లేని వాటిని కూల్చే సే అధికారం సైతం వీరికి ఉంటుంది. అయితే దీన్ని పక్కాగా అమలు చేసిన పాపాన పోవట్లేదు. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఉంది. ఇక్కడ ఇంజనీర్లూ అం దుబాటులో ఉంటారు. వీరి సహాయం తీసుకొనే విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు. రూ.20 కోట్లకు పైగా ‘అక్రమ దోపిడీ’... నాలుగేళ్లలో (2009-2012)నో పార్కింగ్, డేంజరస్ పార్కింగ్‌ల్లో వాహనాలు ఉంచారంటూ స్పాట్లో విధించిన చలాన్లతో పాటు ఆ వాహనాలను వేరే ప్రాంతానికి క్రేన్ల ద్వారా తరలించి (టోవింగ్) చేసిన కేసులు 21,62,479 నమోదయ్యాయి. వీరిలో ఒక్కోక్కరికీ కనిష్టంగా రూ.200 జరిమానా విధించారనుకున్నా... రూ.43,24,95,800 వసూలు చేశారు. ఇందులో సగం మంది అవకాశం ఉన్నా ఉల్లంఘనలకు పాల్పడ్డారని భావించినా ... పార్కింగ్ అవకాశం లేక అనివార్యంగా నో పార్కింగ్‌లో ఆపి దొరికిపోయారు. వీరి నుంచి వసూలు చేసిన రూ.20 కోట్లకు పైగా జరిమానాలు ‘అక్రమ దోపిడీ’ కిందికే వస్తుందనడంలో సందేహం లేదు. ముందు ‘పార్కింగ్’ చూపించండి వ్యాపార సంస్థల వద్ద పార్కింగ్ స్థలం ఉండదు. ఆయా అవసరాలకు దుకాణాలకు వెళ్లే వారు వాహనాల్ని ఎక్కడ నిలపాలి? రోడ్డు పక్కన నిలిపితే రూ.వెయ్యి వదుల్చుకోవాల్సిందే. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆయా వ్యాపార సంస్థలు తప్పకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. నేను రోడ్డు పక్కన బండి ఆపి టీ తాగిన పాపానికి భారీగా చెల్లించాల్సి వచ్చింది. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలు ఎందుకు తొలగించరు? ఇదేం న్యాయం? - రఘురాంరెడ్డి, విద్యావేత్త, విద్యానగర్ విజ్ఞానపురి కాలనీ ట్రాఫిక్ చిక్కులు పరిష్కరించండి అడుగడునా అడ్డంకులు. రోడ్ల నిండా గోతులు ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్కమ పార్కింగ్లు. నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందే కనిపించరు. వీటిని పరిష్కరించకుండా జరిమానాల పేరిట వేలకు వేలు గుంజడం న్యాయం కాదు. - మదన్, మెకానికల్ ఇంజనీర్, నల్లకుంట