
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.600 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పరిపాలనపరమైన అనుమతిని మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
టీచింగ్ ఆస్పత్రితోపాటు హస్టళ్లు, క్వార్టర్లు, నర్సింగ్ కాలేజీ, అనుబంధ భవనాలతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీకి పరిపాలన అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్యవిద్య సంచాలకులను ఆదేశించింది. (క్లిక్ చేయండి: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి)
Comments
Please login to add a commentAdd a comment