
సాక్షి, పార్వతీపురం: పెళ్లికి వేడుకకు హాజరైన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. కొమరాడ మండలం చోళపదం వద్ద ఓ ఆటో.. లారీని ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా తుమ్మలవలసలో పెళ్లి వేడుకకు హాజరై.. తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో మృతులను అంటివలస గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment