auto and lorry collisioned
-
పార్వతీపురం మన్యం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, పార్వతీపురం: పెళ్లికి వేడుకకు హాజరైన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కొమరాడ మండలం చోళపదం వద్ద ఓ ఆటో.. లారీని ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా తుమ్మలవలసలో పెళ్లి వేడుకకు హాజరై.. తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో మృతులను అంటివలస గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
ఇద్దరి మృతదేహాలు లభ్యం
సంగం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై బీరాపేరు వంతెన వద్ద గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో వాగులో గల్లంతైన ఐదుగురిలో ఇద్దరి మృతదేహాలను శనివారం గుర్తించారు. గురువారం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహించారు. ప్రమాదంలో గల్లంతైన కర్రా పుల్లయ్య(60), కర్రా నాగరాజు (40) మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు తండ్రి, కొడుకు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్రా సంపూర్ణమ్మ, కర్రా పద్మ, దివానపు ఆదెమ్మ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. వారి ఆచూకీ కోసం ఫైబర్ బోట్లు, నాటు పడవలతో, వలలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. -
దొరకని ఆ ఐదుగురి జాడ
సంగం: నెల్లూరు–ముంబై రహదారిపై గురువారం రాత్రి లారీ ఢీకొనడంతో వాగులో ఆటో పడిపోయిన ఘటనలో గల్లంతైన ఐదుగురి జాడ శుక్రవారం రాత్రి వరకు తెలియరాలేదు. కుటుంబ సభ్యుడి కర్మకాండలు ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో నెల్లూరు జిల్లా సంగం సమీపంలో గురువారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగరాజు, భార్య పద్మ, కర్రా పుల్లయ్య, అతని భార్య సంపూర్ణమ్మ, దివానపు ఆదెమ్మ గల్లంతైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏడుగుర్ని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ వారిలో బాలిక నాగవల్లి (14) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. గల్లంతైన వారి కోసం జాయింట్ కలెక్టర్ హరేంద్రప్రసాద్, ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆధ్వర్యంలో బృందాలు బీరాపేరు వాగులో గాలిస్తున్నాయి. వాగులో ప్రవాహ ఉధృతి శుక్రవారం మరింత పెరగడంతో ఎంత వెతికినా ఒక్కరి జాడ కూడా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ఆటోను వాగులోంచి బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బీరాపేరు వాగంతా జల్లెడ పట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు కృష్ణపట్నం నుంచి మరబోటును తెప్పించి క్రేన్ సహాయంతో కిందకు దింపారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ
చిలుకూరు: వారంతా కోదాడలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చారు. అది ముగియగానే జాన్‌పహాడ్ దర్గాను దర్శించుకుని రాత్రి హుజూర్‌నగర్‌లో ఉన్న మరో బంధువు ఇంట్లో బస చేశారు. ఉదయం అక్కడినుంచి సొంత ప్రాంతానికి వెళ్లాలంటే కోదాడకు రావాలి. దీంతో హుజూర్నగర్నుంచి కోదాడకు ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగానే ఆటో వేగంగా ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు షేక్ అఫ్జల్‌పాషా (48), గౌసియాబేగం (40), మహమూదాబేగం (35), మహిన్ (15), ముస్కాన్ (12), షేక్ మహబూ బ్ పాషా (40) మృతిచెందారు. జాకీర్‌పాషా, ఆటో డ్రైవర్ నాగుల్ మీరాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్‌కు వచ్చి.. కుటుంబ పెద్ద అయిన షేక్ అఫ్జల్ పాషా, ఆయన భార్య గౌసియా బేగం, తమ్ముడు షేక్ మహబూబ్ పాషా, తమ్ముడి భార్య మహమూదాబేగం, తమ్ముడి కుమార్తెలు మహిన్, ముస్కాన్, ఆయన కొడుకు జాకీర్పాషాలు సూర్యాపేట జిల్లా కోదాడలో ఉంటున్న తన చెల్లెలు అక్తర్‌బేగం ఇంట్లో ఫంక్షన్ కోసం బుధవారం వచ్చారు. ఫంక్షన్ పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో ఉంటున్న అఫ్జల్ పాషా చిన్న తమ్ము డు యాకుబ్ ఇంటికి వెళ్లారు. అ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. రాత్రి సమయంలో వెళ్లడం ఇబ్బంది అనుకుని అక్కడే నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు తమ స్వగ్రామానికి బయలుదేరారు. హుజూర్ నగర్ నుంచి కోదాడ వచ్చేందుకు లోకల్ ఆటో మాట్లాడుకున్నారు. కోదాడకు వస్తుండగా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో షేక్ అఫ్జల్‌పాషా, గౌసియాబేగం, మహమూదాబేగం, మహిన్లకు తీవ్ర గాయా లు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలైన ముస్కాన్, షేక్ మహబూబ్ పాషా, ఆటోడ్రైవ ర్ నాగుల్ మీరాలను హుజూర్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా ముస్కాన్ మార్గమధ్యలో చనిపోయింది. మహబూబ్ పాషా, డ్రైవర్‌ను మెరుగైన చికిత్స అక్కడినుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్ పాషా మృతిచెందాడు. జాకీర్ పాషా, ఆటోడ్రైవర్ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శవపరీక్ష అనంతరం బంధువులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, డీ ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐలు రవి, శ్రీనివాస్‌రెడ్డిలు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి తీవ్రగాయాలు
వరంగల్ అర్బన్: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు శివారులో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా వర్థన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.