న్యూఢిల్లీ: ఒక న్యాయమూర్తిని పదోన్నతిపై కర్ణాటక హైకోర్టుకు పంపే ముందు ఆయనపై ఓ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును సుప్రీంకోర్టు కొలీజియం పట్టించుకోలేదని న్యాయశాఖ సీనియర్ అధికారులు తెలిపారు. న్యాయవ్యవస్థలో నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ అడ్డుకుంటోందన్న జస్టిస్ చలమేశ్వర్ ఆరోపణలను వారు ఖండించారు. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కృష్ణ భట్‌కు పదోన్నతి ఇవ్వాలన్న కొలీజియం సిఫారసుపై ప్రభుత్వం తొందరపడలేదని తెలిపారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు పట్టించుకోలేదనే కారణంతోనే కొలీజియం ప్రతిపాదనలను న్యాయశాఖ రెండుసార్లు వెనక్కి పంపిందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఆ అధికారులు వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి భవన్‌కు బాధితురాలు ఫిర్యాదు చేయటంతో పదోన్నతి ప్రతిపాదనను రెండోసారి కొలీజియంకు పంపారని తెలిపారు. నిర్దేశిత విధివిధానాల మేరకు..ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్‌కు మాత్రమే న్యాయశాఖ లేఖ రాసిందనీ, అంతేకానీ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాదన్నారు. అలాంటి అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా కొలీజియం లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కనపెట్టిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment