
మూడవత్ హిమబిందు
సాక్షి, పెద్దవూర(నల్లగొండ): మండలంలోని ఏనెమీది తండాకు చెందిన మూడవత్ హిమబిందు శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో జడ్జిగా ఎంపికైంది. పట్టుదలతో చదివితే సాధించలేనిదంటూ ఏమీ లేదని గిరిజన బిడ్డ నిరూపింంది. ఆమె కటిక పేదరికంలో పుట్టినా ఆమె విజయానికి పేదరికం అడ్డుతగలలేదు. ఆమె 2019లో డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తరువాత హైకోర్టులో బార్ అసోసియేషన్ సభ్యత్వం పొంది ప్రాక్టిస్‌చేసింది. శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో హిమబిందు జడ్జిగా ఎంపికైనట్లు ఆమె మంగళవారం తెలిపారు. హిమబిందు జడ్జిగా ఎంపికవ్వడంపై తల్లిదుండ్రులు, గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment